కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 126

మేల్కొని ఉంటూ, స్థిరంగా ముందుకు సాగండి

మేల్కొని ఉంటూ, స్థిరంగా ముందుకు సాగండి

(1 కొరింథీయులు 16:13)

  1. 1. పౌరుషం చూపే యోధుల్లా,

    తీక్షణంగా చూస్తుందాం.

    ఓర్పునే చూపిస్తూ ఉందాం,

    తీరమే చేరే దాకా.

    క్రీస్తు నిర్దేశాలే పాటిస్తూ

    స్థిరంగా వెళ్తుందాం ముందుకు.

    (పల్లవి)

    సైనికుల్లా మేల్కొనే ఉంటే

    చేరుకుంటాం గమ్యాన్నే.

  2. 2. నక్కి ఉన్నాడు సాతానే

    అప్రమత్తంగా ఉందాం.

    దాసుడే చూపిస్తున్నాడు

    రక్షణిచ్చే మార్గాన్ని.

    ప్రేమతోనే కాపాడాలనే

    సేవ చేస్తున్నారు పెద్దలు.

    (పల్లవి)

    సైనికుల్లా మేల్కొనే ఉంటే

    చేరుకుంటాం గమ్యాన్నే.

  3. 3. రెప్పవాల్చం ఈ యుద్ధంలో

    మంచివార్తే చాటిస్తాం.

    గర్జనే చేసే సింహాన్నే

    తప్పకుండా ఓడిస్తాం.

    రాజ్య సందేశాన్నే చాటుతూ

    శాశ్వతాశీర్వాదం పొందుతాం.

    (పల్లవి)

    సైనికుల్లా మేల్కొనే ఉంటే

    చేరుకుంటాం గమ్యాన్నే.