కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 134

పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

పిల్లలు యెహోవా ఇచ్చిన బాధ్యత

(కీర్తన 127:3-5)

  1. 1. పిల్లలు యెహోవా ఇచ్చే

    వెలకట్టలేని సంపదలు.

    బాధ్యతగా పెంచాలి మీరు;

    ఈ విషయం మరువద్దు.

    జీవదాత, ప్రేమకు మూలం

    యెహోవాయే ఇచ్చాడు నిర్దేశం.

    ఈ జ్ఞానం పాటించి ఎప్పుడూ,

    సరిగ్గా పెంచాలి పిల్లల్ని.

    (పల్లవి)

    ఈ బాధ్యత ఎంతో పవిత్రం;

    అమూల్యము వాళ్ల ప్రాణం.

    నేర్పించండి దేవుని మార్గం,

    పొందాలంటే వాళ్లు జీవం.

  2. 2. దేవుని నియమాలన్నీ

    హృదయంలో ఉండాలి ముందుగా;

    పిల్లలకు నేర్పాలి మీరే,

    నమ్మకంగా ప్రతీక్షణం.

    బోధించండి ఏమి చేస్తున్నా,

    ఉంటూ మీరు ఆదర్శప్రాయంగా;

    మీ బాటలోనే నడుస్తారు,

    తొలగిపోరు ఏనాటికీ.

    (పల్లవి)

    ఈ బాధ్యత ఎంతో పవిత్రం;

    అమూల్యము వాళ్ల ప్రాణం.

    నేర్పించండి దేవుని మార్గం,

    పొందాలంటే వాళ్లు జీవం.