పాట 137
నమ్మకమైన స్త్రీలు, క్రైస్తవ సహోదరీలు
-
1. శారా, ఎస్తేరు, రూతు ఇతరులు
సమర్థవంతులు, మంచి భార్యలు.
దైవభక్తే వాళ్ల జీవిత లక్ష్యం,
రాసున్నాయి వాళ్ల పేర్లు బైబిల్లో.
విశ్వాసం చూపిన స్త్రీలెందరో;
పేర్లు లేవు గానీ దైవామోదం ఉంది.
-
2. ధైర్యం, విశ్వాసం, దయ, మంచితనం
పెట్టాడు మనలో యెహోవా తండ్రి.
గుర్తుకొస్తాయి ఈ సుగుణాలన్నీ,
చూసినప్పుడు ఈ స్త్రీల ఆదర్శం.
మనకాలంలో సహోదరీలు
మనకందరికీ ఆదర్శప్రాయులు.
-
3. తల్లి, కుమార్తె, భార్య, సోదరీలు;
ఉన్నారు కొందరు ఒంటరివాళ్లూ.
సంతోషంగా ప్రయాసపడతారు,
అణకువతో లోబడివుంటారు.
సోదరీల్లారా, వీడండి భయం;
యెహోవా మెచ్చాడు, బహుమతి మీదే.
(ఫిలి. 4:3; 1 తిమో. 2:9, 10; 1 పేతు. 3:4, 5 కూడా చూడండి.)