కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 14

కొత్త భూరాజును స్తుతిద్దాం

కొత్త భూరాజును స్తుతిద్దాం

(కీర్తన 2:12)

  1. 1. గొప్ప సమూహం వస్తుంది

    అన్ని దేశాల నుండి;

    చిన్నమంద ద్వారా క్రీస్తు

    సమకూరుస్తున్నాడు.

    ఏలుతోంది దైవ రాజ్యం;

    రావాలి ఈ భూమి పైకి.

    ఈ వాగ్దానమిస్తుంది ఎంతో

    ఆనందాన్ని, ఓదార్పును.

    (పల్లవి)

    యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభువును

    స్తుతిద్దాం మనం నిరంతరం.

    లోబడి ఉందాం విధేయతతో

    ఆయన పాలనకు.

  2. 2. జయగీతంతో కీర్తిద్దాం,

    ఏలుతున్న క్రీస్తును.

    సమాధాన అధిపతి

    రక్షిస్తాడు మనల్ని.

    చూస్తాం మనం త్వరలోనే

    భీతి, భయం లేని లోకం;

    చనిపోయిన వాళ్లెందర్నో

    ఆయన బ్రతికిస్తాడు.

    (పల్లవి)

    యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభువును

    స్తుతిద్దాం మనం నిరంతరం.

    లోబడి ఉందాం విధేయతతో

    ఆయన పాలనకు.