కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 150

రక్షణ కోసం యెహోవా వైపు చూడండి

రక్షణ కోసం యెహోవా వైపు చూడండి

(జెఫన్యా 2:3)

  1. 1. దేవుని ఆజ్ఞలే

    సంకెళ్లని ఎంచుతూ

    తెంచేస్తామంటూ దాడికే

    వస్తారు పాలకులు.

    దేవుని శక్తితో

    క్రీస్తే దిగిరావడం

    చూస్తూ తరిస్తాము త్వరలో,

    రాజ్యాన్ని స్థాపిస్తాడు.

    (పల్లవి)

    చూపిస్తుందాము సాత్వికం,

    నీతిన్యాయాల్ని పాటిద్దాం.

    లోబడే ఉండి,

    నమ్మకం పెట్టి,

    సర్వశక్తుణ్ణే సేవిస్తే

    యెహోవా చేతి రక్షణే,

    స్వయంగా చూస్తాం.

  2. 2. విశ్వసనీయులే

    పొందాలని ఊరట,

    సువార్త చాటించే పనే

    నిస్వార్థంగా చేస్తున్నాం.

    ఆటంకాలే తెస్తూ,

    ఆపాలని చూస్తారు

    అసాధ్యం ఈ పని ఆపడం,

    తండ్రే సహాయకుడు.

    (పల్లవి)

    చూపిస్తుందాము సాత్వికం,

    నీతిన్యాయాల్ని పాటిద్దాం.

    లోబడే ఉండి,

    నమ్మకం పెట్టి,

    సర్వశక్తుణ్ణే సేవిస్తే

    యెహోవా చేతి రక్షణే,

    స్వయంగా చూస్తాం.