కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

28వ పాట

యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

యెహోవా స్నేహాన్ని సంపాదించుకోవడం

(15వ కీర్తన)

  1. 1. నీ గుడారంలోన నీ స్నేహితుల్లాగా

    ఉండాలంటే మేం ఏంచేయాలో నేర్పించావు దేవా.

    నీ వాక్యం ప్రేమిస్తూ, నీపై విశ్వాసంతో

    జీవించాలి మేం ఎల్లప్పుడూ న్యాయంగా, నీతిగా.

  2. 2. నీ స్నేహితుల్లాగా నీ హృదయానికి

    తేవాలంటే మేం సంతోషము చూపావు మార్గము.

    నీ పేరు కీర్తిస్తూ, నీ వాక్యం పాటిస్తూ

    మాటల్లోనూ మా చేతల్లోనూ సత్యంగా ఉండాలి.

  3. 3. మా చింతలన్నిటినీ, మా హృదయాలనూ

    కుమ్మరించి నీ సన్నిధిలో ఉంటాము ధైర్యంగా.

    నీ స్నేహం కావాలి, ఆ స్నేహం ఎదగాలి;

    నీకన్నా గొప్ప స్నేహితుడు దొరకడు మాకింక.

(కీర్త. 139:1; 1 పేతు. 5:6, 7 కూడా చూడండి.)