పాట 29
మన పేరుకు తగ్గట్టుగా జీవిద్దాం
-
1. ప్రేమాస్వరూపి, మా దేవా యెహోవా,
నీ న్యాయం, శక్తి ఎంతో గొప్పవి.
జ్ఞాన సత్యాలకు మూలము నీవే,
విశ్వాన్ని ఏలే సర్వాధిపతి.
చాటిస్తూ రాజ్య సువార్తను మేము
సంతోషంతో సేవిస్తాము తండ్రి.
(పల్లవి)
సాక్షులై ఉండే వరాన్ని ఇచ్చావు.
నీ నమ్మకాన్ని వమ్ము చేయము.
-
2. ఐక్యంగా చేసే పవిత్ర సేవంతా
పెంచుతుంది మామధ్య ప్రేమను.
సత్యాన్ని చాటి, నీ మాటను వింటూ
సంతోషంతో నిన్ను కీర్తిస్తాము.
నీ పేరునిచ్చి సాక్షుల్ని చేశావు
ఘనతను తెస్తాం నీకు మేము.
(పల్లవి)
సాక్షులై ఉండే వరాన్ని ఇచ్చావు.
నీ నమ్మకాన్ని వమ్ము చేయము.
(ద్వితీ. 32:4; కీర్త. 43:3; దాని. 2:20, 21 కూడా చూడండి.)