కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40వ పాట

మనం ఎవరి పక్షం?

మనం ఎవరి పక్షం?

(రోమీయులు 14:8)

  1. 1. నువ్వెవరి పక్షం?

    ఏ దేవునికి సొంతం?

    ఎవ్వరికి మోకరిస్తావో

    ఆయనేగా నీ ప్రభువు.

    సేవించలేం మనం

    ఇద్దరు దేవుళ్లను.

    మనసులోన నిండిన ప్రేమ

    పంచలేం ఇద్దరికీ.

  2. 2. నువ్వెవరి పక్షం?

    ఏ దేవునికి సొంతం?

    నిర్ణయించుకోవాలి నువ్వే,

    ఏ దేవుణ్ణి సేవిస్తావో.

    ఈ లోకాన్ని నువ్వు

    ఇంకా ప్రేమిస్తున్నావా?

    లేక ఎల్లప్పుడూ దైవ చిత్తం

    చేస్తూ లోబడతావా?

  3. 3. నే యెహోవా పక్షం,

    నేను ఆయన సొంతం.

    పరలోక తండ్రి, ఆయన్నే

    సేవిస్తాను సంపూర్ణంగా.

    ఎంతో త్యాగం చేసి

    నన్ను విడిపించిన,

    యెహోవా పేరునే స్తుతిస్తాను

    మానక ప్రతిరోజూ.