పాట 43
కృతజ్ఞతా ప్రార్థన
-
1. ప్రేమాస్వరూపి, యెహోవా మా దేవా,
తండ్రీ, నిన్నే మేము స్తుతిస్తాము.
దేవా నీ వాత్సల్యం ఎంతో గొప్పది,
నీపై భారం వేసి సేవ చేస్తాం.
నీ హృదయాన్ని మేం నొప్పించామేమో,
తండ్రీ క్షమించు మా తప్పులను.
క్రీస్తు రక్తం ద్వారా విమోచించావు,
సదా కృతజ్ఞులమై ఉంటాము.
-
2. ఎంతో దయను చూపిస్తూ మా మీద,
నీ స్నేహితులుగా చేసుకున్నావ్.
బోధించు దేవా నీ మార్గాన్ని మాకు,
నమ్మకంగా ఉంటాం నీకెప్పుడూ.
తండ్రీ నీ పవిత్రశక్తిని ఇస్తూ
బలపరుస్తున్నావు మమ్మల్ని.
దీనమనస్సుతో సేవిస్తూ నిన్ను
సంతోషం పొందేలా సాయం చేయి.
(కీర్త. 65:2, 4, 11; ఫిలి. 4:6 కూడా చూడండి.)