పాట 46
యెహోవా, నీకు కృతజ్ఞతలు
-
1. యెహోవా, నీవిచ్చిన జీవానికై,
ధన్యులము సత్య వెలుగుకై.
ప్రార్థించే వరాన్ని ఇచ్చినందుకై
యెహోవా నీకెంతో కృతజ్ఞులం.
-
2. త్యాగమూర్తివై పంపావు సుతున్ని,
విశ్వాసంతో గెల్చాడు లోకాన్ని.
మాకు చూపించావు మంచి మార్గాన్ని.
యెహోవా నీకెంతో కృతజ్ఞులం.
-
3. నీ నామాన్ని చాటే సదవకాశం,
మాకు నీవిచ్చిన ఆశీర్వాదం.
కష్టాల్ని త్వరలో తీర్చే ఓ రాజ్యం
తెచ్చే నీకు మేము కృతజ్ఞులం.
(కీర్త. 50:14; 95:2; 147:7; కొలొ. 3:15 కూడా చూడండి.)