కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

47వ పాట

ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించండి

ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించండి

(1 థెస్సలొనీకయులు 5:17)

  1. 1. ప్రార్థిద్దాం యెహోవా దేవునికి,

    స్నేహితునితో మాట్లాడినట్టు.

    కుమ్మరిద్దాం మన హృదయాల్ని,

    మోపుదాం ఆయనపై భారాన్ని.

    ప్రార్థిద్దాం ప్రతీరోజు.

  2. 2. ప్రార్థిద్దాం కృతజ్ఞత చెల్లిస్తూ,

    వేడుకుందాం క్షమాపణ కోసం.

    ఒప్పుకుందాం చేసిన తప్పుల్ని,

    మన్నిస్తాడనే నమ్మకముతో.

    ప్రార్థిద్దాం ప్రతీరోజు.

  3. 3. ప్రార్థిద్దాం కష్టాల్లో ఉన్నప్పుడు,

    ఆయనే మన తండ్రి, ఆప్తుడు.

    వేడుకుందాం సంరక్షణ కోసం,

    వేచిచూద్దాం చేస్తాడని సాయం.

    ప్రార్థిద్దాం ప్రతీరోజు.