పాట 51
దేవునికి సమర్పించుకున్నాం!
-
1. యెహోవా దేవుడే మనల్ని ప్రేమించి,
చేశాడు శిష్యుల్ని క్రీస్తుకు.
సత్యాన్ని నేర్పించాడు,
వెలుగు చూపించాడు;
మెండైన విశ్వాసంతో
సమర్పించాం జీవితం.
(పల్లవి)
యెహోవా దేవుని సొత్తు అయ్యాం మనం,
సంతోషంతో సేవిస్తాము నిత్యం.
-
2. ‘నిన్నే సేవిస్తాము మేము నిరంతరం’
అని తెలిపాము ప్రార్థించి.
సాటిలేనిదీ వరం;
సంతోషంగా చాటుతాం;
యెహోవా నామమును,
రాజ్య సత్యాన్ని కూడా.
(పల్లవి)
యెహోవా దేవుని సొత్తు అయ్యాం మనం,
సంతోషంతో సేవిస్తాము నిత్యం.
(కీర్త. 43:3; 107:22; యోహా. 6:44 కూడా చూడండి.)