కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 65

ప్రగతి సాధిస్తూ ఉండండి

ప్రగతి సాధిస్తూ ఉండండి

(హెబ్రీయులు 6:1)

  1. 1. చక్కని ప్రగతే సాధించాలంటే

    వేయొద్దు వేసిన పునాదే మళ్లీ మళ్లీ.

    చూపేలా స్పష్టంగా సత్యకాంతిని

    సిద్ధంగా ఉందాం అంతా.

    యేసులా చేయాలా ఈ సేవా?

    నిండాలి వాక్యంపై ఆ ప్రేమ.

    ధైర్యంగా చేస్తుంటే పవిత్రసేవ

    యెహోవా తోడుంటాడు.

  2. 2. విశ్వాసం కాపాడే ఐక్యతే ముఖ్యం

    చూపిద్దాం ధైర్యాన్నే మంచివార్తే చాటిస్తూ

    కీర్తిద్దాం భూమంతా క్రీస్తు రాజ్యాన్ని,

    దేశాలే గుర్తించేలా.

    వాళ్లంతా ఒక్కటై వచ్చినా,

    సువార్తే ఆపడం సాధ్యమా!

    ఇంటింటా, వీధుల్లో చాటిస్తూ వెళ్దాం

    సత్యంతో ప్రకాశిస్తూ.

  3. 3. నైపుణ్యం సాధిస్తూ ఆస్వాదిస్తుందాం

    ఆసక్తే ఉందంటే చూసొద్దాం మళ్లీ మళ్లీ.

    వాళ్లలో చూడాలి క్రీస్తు శిష్యుల్ని,

    ప్రయత్నిస్తూనే ఉందాం.

    ప్రేమతో ఇద్దాము ఈ జ్ఞానం

    తోడుందాం పొందేలా బాప్తిస్మం

    ఐక్యంగా సాగాలి అన్నదమ్ముల్లా

    ప్రగతే సాధిస్తుందాం.

(ఫిలి. 1:27; 3:16; హెబ్రీ. 10:39 కూడా చూడండి.)