కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 66

రాజ్యవార్తను చేరవేయండి

రాజ్యవార్తను చేరవేయండి

(ప్రకటన 14:6, 7)

  1. 1. తరాలుగా మరుగునున్న రహస్యం

    వెల్లడైంది మన దేవుని సంకల్పం.

    ఒక్కొకటి వివరంగా చెప్తూ వచ్చి

    సంతానాన్ని, రాజ్యసత్యాన్ని తెల్పాడు.

    పాపంలో మగ్గిపోతున్న ఈ లోకాన్ని

    రక్షించేలా చేశాడు తండ్రి ఓ ఏర్పాటు.

    యేసు చేతికందించాడు అధికారం

    చిన్నమంద కూడా చేస్తుంది సహాయం.

  2. 2. ఈ రాజ్యాన్ని స్థాపించాడు మనకోసం

    తన ప్రేమ, న్యాయంకదే నిదర్శనం.

    కృతజ్ఞత చెప్తూ మనం చేరవేద్దాం

    రాజ్యంవల్ల మనం పొందే ఆశీర్వాదం.

    తండ్రి పేరు ఘనపర్చి, చాటిచెప్దాం

    సాక్షులుగా, అదే మనకున్న గౌరవం.

    సంతోషంగా చేయందిస్తారు దూతలు

    ఇచ్చిన మాటపై నిలబడేందుకు.