కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

77వ పాట

చీకటి లోకంలో వెలుగు

చీకటి లోకంలో వెలుగు

(2 కొరింథీయులు 4:6)

  1. 1. చీకటి అలుముకున్న

    ఈ దుష్ట లోకంలో,

    ఓ జ్యోతి ప్రకాశిస్తుంది

    ఉదయకాంతిలా.

    (పల్లవి)

    ఆశాకిరణంలా

    వెలుగునిచ్చే వార్త

    ప్రకటిద్దాం మనం.

    వేకువ వెలుగై

    ఆహ్వానిస్తుంది అది

    రేపటిని.

  2. 2. నిద్రించే వాళ్లను లేపే

    సమయము ఇదే.

    ప్రార్థిద్దాం వాళ్ల కోసము;

    ధైర్యాన్ని నింపుదాం.

    (పల్లవి)

    ఆశాకిరణంలా

    వెలుగునిచ్చే వార్త

    ప్రకటిద్దాం మనం.

    వేకువ వెలుగై

    ఆహ్వానిస్తుంది అది

    రేపటిని.