కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

87వ పాట

రండి, సేదదీర్పు పొందండి!

రండి, సేదదీర్పు పొందండి!

(హెబ్రీయులు 10:24, 25)

  1. 1. నిజదేవుడెవరో తెలియని

    లోకంలో జీవిస్తున్నాము.

    రక్షణ పొందేందుకు మనకెంతో

    నడిపింపు అవసరం.

    కూటాలు మనలో విశ్వాసం పెంచి,

    నిరీక్షణ నింపుతాయి.

    సత్కార్యాలు చేసేలా బలపర్చి,

    కొత్త ఉత్తేజాన్నిస్తాయి.

    యెహోవా ఆజ్ఞల్ని పాటిస్తూ మనం

    ఆయన చిత్తాన్ని చేద్దాం.

    సరైన మార్గాన్ని హత్తుకునేలా

    చేస్తాయి కూటాలు సాయం.

  2. 2. యెహోవా దేవునికి బాగా తెల్సు

    మన అవసరాలన్నీ.

    కూటాలకు వెళ్లేలా సమయాన్ని

    జ్ఞానంతో ఉపయోగిద్దాం.

    ఎలా చూపించాలో విశ్వాసం మనం

    నేర్పిస్తారు సోదరులు.

    విశ్వాస కుటుంబంలో సభ్యులంతా

    ఉంటారెప్పుడూ తోడుగా.

    మంచిరోజుల కోసం చూస్తూ మనం

    కూటాలకు వస్తూ ఉందాం.

    పైనుండి వచ్చే జ్ఞానం ప్రకారమే

    జీవించడం నేర్చుకుందాం.