కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 90

ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

ఒకరినొకరు ప్రోత్సహించుకోండి

(హెబ్రీయులు 10:24, 25)

  1. 1. మనం నమ్మకంగా ఉండేలా

    ప్రోత్సహించుకున్నప్పుడు,

    మన మధ్యున్న ప్రేమబంధం

    ఎంతో బలపడుతుంది.

    కష్టాల్ని తట్టుకునే ధైర్యం

    ఇస్తుంది సోదరప్రేమే.

    సంఘం ఓ ఆశ్రయం లాంటిది,

    ఎంతో సురక్షితమైంది.

  2. 2. సమయోచితమైన మాట

    ఎంతో ఓదార్పునిస్తుంది;

    మన ప్రియ సహోదరుల

    నోటే వింటాము వాటిని.

    ఒకే లక్ష్యాలున్న వారితో

    పనిచేయడం ఓ వరం!

    ప్రేమతో ఒకరినొకరం

    సదా బలపర్చుకుందాం.

  3. 3. యెహోవా రోజు వస్తుందని

    మనోనేత్రాలతో చూస్తూ

    మానక కూటాలకు వద్దాం;

    రక్షణ మార్గంలో ఉందాం.

    యెహోవా ప్రజలతోపాటు

    నిత్యం సేవిద్దాం ఆయన్ని;

    అందుకై ఒకరినొకరం

    ప్రోత్సహించుకుంటూ ఉందాం.