పాట 94
దేవుని వాక్యం పట్ల కృతజ్ఞత
-
1. యెహోవా మా తండ్రి, నీవు ఇచ్చిన
వాక్యానికై మేమెంతో కృతజ్ఞులం!
స్వయంగా ప్రేరేపించి
రాయించావ్ దానిని,
ఆ సత్యం చేస్తుంది స్వతంత్రులను.
-
2. శోధిస్తుంది వాక్యం మా హృదయాల్ని.
సరిచేస్తుంది ఆలోచనలను.
నీ ఆజ్ఞ పరిపూర్ణం,
నీ తీర్పులు సత్యం.
నడిపిస్తాయవి మమ్మల్ని నిత్యం.
-
3. మానవులతోనే రాయించావ్ దాన్ని.
నీ ప్రవక్తలంతా మా లాంటి వాళ్లే.
విశ్వాసం బలపర్చే
నీ వాక్యాన్ని రోజూ
ధ్యానించేలా మాకు సహాయం చేయి.
(కీర్త. 19:9; 119:16, 162; 2 తిమో. 3:16; యాకో. 5:17; 2 పేతు. 1:21 కూడా చూడండి.)