కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 96

 యిహోవాయే ప్రేరేపించి రాయించిన గొప్ప గ్రంథం

 యిహోవాయే ప్రేరేపించి రాయించిన గొప్ప గ్రంథం

(సామెతలు 2:1)

  1. 1. ఎన్నో పేజీలు ఉన్న ఓ పుస్తకం,

    తెస్తుంది శాంతి సంతోషాలను.

    దానిలోని మాటలకున్న శక్తి,

    జీవాన్నిస్తుంది మనందరికీ.

    యెహోవా ప్రేరేపించి రాయించాడు,

    బైబిలనే ఈ గొప్ప గ్రంథాన్ని.

    దేవుణ్ణి ఎంతో ప్రేమించారు వాళ్లు,

    పవిత్రశక్తితోనే రాశారు.

  2. 2. రాశారు వాళ్లు ఎన్నో సంగతులు:

    దేవుడెలా విశ్వాన్ని చేశాడో;

    పాపంలేని మొదటి మానవులు

    పరదైసునెలా కోల్పోయారో;

    దేవుని పరిపాలనా హక్కును

    సాతానెలా సవాలు చేశాడో;

    దానివల్ల వచ్చిన బాధలన్నీ

    యెహోవా ఎలా తీసివేస్తాడో.

  3. 3. యెహోవా తాను అభిషేకించిన

    రాజు ద్వారా ఏలుతున్నాడనే

    మంచివార్త ప్రకటిద్దాం అంతటా,

    పంచుకుందాం మన నిరీక్షణ.

    సంతోషాన్నిచ్చే ఎన్నో సంగతులు,

    ఉన్న పవిత్ర పుస్తకం ఇది.

    ఆలోచనకు మించిన శాంతిని

    ఇచ్చే ఈ గ్రంథం గొప్ప సంపద.

(2 తిమో. 3:16; 2 పేతు. 1:21 కూడా చూడండి.)