కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అవినీతి లేని ప్రభుత్వం సాధ్యమేనా?

అవినీతి లేని ప్రభుత్వం సాధ్యమేనా?

 ప్రభుత్వ అధికారుల అవినీతి ఒక్క దేశంలో ఉన్న సమస్య కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. a దాని పర్యవసానాలు కూడా దారుణంగా ఉన్నాయి. ఉదాహరణకు కోవిడ్‌ ప్రబలుతున్న సమయంలో, చాలా దేశాల్లో అధికారులు కోవిడ్‌ కోసం ఇచ్చిన నిధుల్ని తమ సొంత లాభం కోసం ఉపయోగించుకున్నారు అని ఆరోపణలు వచ్చాయి. అలాంటి అవినీతి వల్ల మందులు, ఆక్సిజన్‌ లాంటివి దొరకక ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు, చనిపోయారు కూడా.

 ప్రభుత్వాల అవినీతి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మాజీ ప్రధాన మంత్రి అయిన డేవిడ్‌ కామెరూన్‌ ఇలా అన్నాడు: “దేశాలన్నీ అవినీతి అనే పెద్ద సాలెగూడులో చిక్కుకుని ఉన్నాయి.”

 అయితే, ప్రభుత్వాలు చేసే అవినీతి మొత్తం త్వరలోనే అంతమౌతుందని మనం నమ్మకంతో ఉండవచ్చు. ఎందుకు? దేవుడు ఏం చేస్తాడని బైబిలు చెప్తుందో గమనించండి.

దేవుడు అవినీతిని తీసేస్తాడని మనకు ఎలా తెలుసు?

 దేవుడు చెప్తున్న ఈ మాటలు బైబిల్లో ఉన్నాయి: “యెహోవానైన నేను న్యాయాన్ని ప్రేమిస్తాను; దోపిడీ అన్నా, అవినీతి అన్నా నాకు అసహ్యం.” b (యెషయా 61:8) వేరేవాళ్ల అవినీతి వల్ల ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. (సామెతలు 14:31) “బాధితులు అణచివేయబడుతున్నారు . . . కాబట్టి, నేను చర్య తీసుకోవడానికి లేస్తాను” అని ఆయన మాటిస్తున్నాడు.—కీర్తన 12:5.

 దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇప్పుడున్న ప్రభుత్వాల్లో మార్పులు చేసే బదులు, వాటి స్థానంలో తనే సొంతగా ఒక పరలోక ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు. దాన్నే “దేవుని రాజ్యం” అంటారు. (మార్కు 1:14, 15; మత్తయి 6:10) బైబిలు ఇలా చెప్తుంది: “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, . . . అది ఆ [ఇతర] రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.” (దానియేలు 2:44) అలా దేవుడు, ఈరోజుల్లో మనం చూస్తున్న అవినీతిని అంతం చేస్తాడు.

అవినీతే లేని ప్రభుత్వం

 దేవుని రాజ్యం లేదా ప్రభుత్వం ఎప్పటికీ అవినీతిగా మారదని మనకు ఎలా తెలుసు? ఈ కారణాల్ని పరిశీలించండి.

  1.  1. అధికారం. ఆ రాజ్యానికి అధికారం ఇచ్చింది సర్వశక్తిగల దేవుడే.—ప్రకటన 11:15.

     ఇది ఎందుకు ప్రాముఖ్యం: మానవ ప్రభుత్వాలు పౌరుల నుండి వచ్చే డబ్బుతోనే పనిచేస్తుంటాయి. దానివల్ల లంచాలు, దొంగతనం, మోసం జరిగే అవకాశాలు ఎక్కువ. అయితే, దేవుని రాజ్యం మాత్రం సర్వశక్తిగల దేవుని మద్దతుతో పనిచేస్తుంది. కాబట్టి, అది ఎప్పుడూ దాని పౌరుల అవసరాల్ని తీర్చగలదు.—కీర్తన 145:16.

  2.  2. రాజు. ఆ రాజ్యానికి రాజుగా దేవుడు యేసుక్రీస్తును నియమించాడు.—దానియేలు 7:13, 14.

     ఇది ఎందుకు ప్రాముఖ్యం: కొన్నిసార్లు మంచి పరిపాలకులు కూడా, చెడు ప్రభావానికి లోనై అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. (ప్రసంగి 7:20) కానీ, యేసు మాత్రం తనను ఎవ్వరూ లంచంతో కొనలేరని చూపించాడు. (మత్తయి 4:8-11) అంతేకాదు, ఆయన తన పౌరుల్ని నిజంగా ప్రేమిస్తాడు, వాళ్ల బాగోగుల విషయంలో నిజమైన శ్రద్ధ చూపిస్తాడు.—కీర్తన 72:12-14.

  3.  3. చట్టాలు. దేవుని రాజ్యం పెట్టే చట్టాలు పరిపూర్ణమైనవి, అంతేకాదు అవి సేదదీర్పునిస్తాయి.—కీర్తన 19:7, 8.

     ఇది ఎందుకు ప్రాముఖ్యం: చాలావరకు మనుషులు పెట్టే చట్టాలు పాటించడానికి కష్టంగా, భారంగా ఉంటాయి. పైగా, వాటిని అమలుచేసే పద్ధతి కూడా సరిగ్గా ఉండదు. దానివల్ల అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ. కానీ, దేవుడు పెట్టే చట్టాలు మాత్రం పాటించడానికి తేలిగ్గా, ప్రయోజనకరంగా ఉంటాయి. (యెషయా 48:17, 18) అలాగే అవి తప్పుడు పనుల్నే కాదు, తప్పుడు ఉద్దేశాల్ని కూడా కట్టడిచేస్తాయి. (మత్తయి 22:37, 39) ఎందుకంటే దేవుడు హృదయాల్ని చదవగలడు, అంతేకాదు తాను పెట్టే చట్టాలు కనికరంతో అమలయ్యేలా చూడగలడు.—యిర్మీయా 17:10.

 భవిష్యత్తులో అవినీతే లేని ప్రభుత్వం వస్తుందని బైబిలు మాటిస్తుంది. దాని గురించి ఎక్కువ తెలుసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

a ఒక డిక్షనరీ ప్రకారం, “అవినీతి” అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సొంత లాభం కోసం వాడుకోవడం.

b యెహోవా అనేది దేవుని పేరు. (కీర్తన 83:18) “యెహోవా ఎవరు?” అనే ఆర్టికల్‌ చూడండి.