కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచవ్యాప్త ఆహారకొరతల్ని మరింత పెంచుతోంది

యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచవ్యాప్త ఆహారకొరతల్ని మరింత పెంచుతోంది

 “కోవిడ్‌ మహమ్మారి వల్ల, వాతావరణంలో జరిగిన మార్పు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆహారకొరతలు ఉన్నాయి. అయితే, యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఆహారకొరత కొన్ని ప్రాంతాల్లో కరువుగా మారే ప్రమాదం ఉంది” అని 75కంటే ఎక్కువమంది ఉన్నతస్థాయి అధికారులు 2022, మే 19న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమాచారం అందించారు. తర్వాత రెండు రోజులకే, ది ఎకనామిస్ట్‌ పత్రిక ఇలా ప్రకటించింది: “ఇప్పటికే ఎన్నో సమస్యలున్న ప్రపంచంలో, ఈ యుద్ధం వల్ల ఆకలితో అలమటించే ప్రజలు మరింత పెరుగుతారు.” ఇలాంటి ఆహారకొరతలు మన కాలంలో వస్తాయని బైబిలు ముందే చెప్పింది, దాంతోపాటు వాటిని ఎలా ఎదుర్కోవచ్చో కూడా బైబిలు చెప్తుంది.

ఆహారకొరతల గురించి బైబిలు ముందే చెప్పింది

  •    యేసు ముందే ఇలా చెప్పాడు: ‘ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి, ఆహారకొరతలు వస్తాయి.’మత్తయి 24:7.

  •    బైబిల్లోని ప్రకటన పుస్తకం, నలుగురు గుర్రపురౌతుల గురించి సూచనార్థకంగా వర్ణిస్తుంది. వాళ్లలో ఎర్రని గుర్రం మీద వచ్చే వ్యక్తి యుద్ధానికి సూచనగా ఉన్నాడు. అతని వెనుక నల్లని గుర్రం మీద వచ్చే వ్యక్తి కరువుకు సూచనగా ఉన్నాడు. ఆ సమయంలో ఆహారం దొరకడం కష్టంగా ఉంటుంది, ప్రజలు ఎక్కువ ధర పెట్టి ఆహారాన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. “నేను చూసినప్పుడు …, ఒక నల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది. … ఒక స్వరం ఇలా అనడం విన్నాను: ‘దేనారానికి [అంటే, ఒక రోజు కూలికి] ఒక కిలో గోధుమలు, దేనారానికి [అంటే, ఒక రోజు కూలికి] మూడు కిలోల బార్లీ.’”—ప్రకటన 6:5, 6.

 ఆహారకొరతల గురించి బైబిలు ముందే చెప్పిన విషయాలు ఇప్పుడు, అంటే “చివరి రోజులు” అని బైబిలు పిలుస్తున్న ఈ కాలంలో నెరవేరుతున్నాయి. (2 తిమోతి 3:1) “చివరి రోజుల” గురించి అలాగే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన గుర్రపురౌతుల గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, 1914 నుండి లోకం మారిపోయింది అనే వీడియో చూడండి. అలాగే “నాలుగు గుర్రాల మీద స్వారీ చేస్తున్న వ్యక్తులు ఎవరు?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చదవండి.

బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

  •    ధరలు పెరిగిపోవడం, ఆహారకొరతలు వంటి కష్టమైన పరిస్థితుల్ని తట్టుకోవడానికి, మనకు సహాయం చేసే చక్కని సలహాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని సలహాల కోసం “ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?” అనే ఆర్టికల్‌ చదవండి.

  •    పరిస్థితులు మంచిగా మారతాయని బైబిలు మనలో ఆశను నింపుతుంది. “భూమ్మీద సస్యసమృద్ధి” ఉండే కాలం వస్తుందని, అప్పుడు అందరూ కడుపునిండా తినడానికి కావలసినంత ఆహారం ఉంటుందని బైబిలు మాటిస్తోంది. (కీర్తన 72:16) భవిష్యత్తులో ఇంకా ఏ మార్పులు జరుగుతాయని బైబిలు మాటిస్తుందో, మీరు వాటిని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి, “మంచి రోజులు వస్తాయనే నిజమైన ఆశ” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చదవండి.