అప్రమత్తంగా ఉండండి!
ఎందుకింత ద్వేషం?—బైబిలు ఏం చెప్తుంది?
ద్వేషంతో నిండిపోయిన మాటలు, నేరాలు, హింస, యుద్ధాలతోనే వార్తలు రాజ్యమేలుతున్నాయి.
“గాజా-ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం అలాగే తీవ్రవాదులు రెచ్చగొట్టడం వల్ల సోషల్ మీడియాలో, ద్వేషంతో నిండిపోయిన మాటలు ఇంకా ఎక్కువ హల్‌చల్ చేస్తున్నాయి.”—ది న్యూయార్క్ టైమ్స్, 2023, నవంబరు 15.
“అక్టోబరు 7 తర్వాత నుండి ద్వేషంతో నిండిపోయిన మాటలు, నేరాలు అలాగే వాటి గురించి ఆందోళన ప్రపంచంలో అంచెలంచెలుగా పెరిగిపోయాయి.”—డెన్నిస్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, 2023 నవంబరు 3,.
ద్వేషంతో నిండిపోయిన మాటలు, హింస, యుద్ధాలు కొత్త ఏమి కాదు. నిజానికి గతంలో కూడా “కఠినమైన మాటల్ని బాణాల్లా” ఎక్కుపెట్టిన వాళ్లు, యుద్ధాలు చేసిన వాళ్లు, హింసించిన వాళ్లు ఉన్నారని బైబిలు వివరిస్తుంది. (కీర్తన 64:3; 120:7; 140:1) కానీ ఇప్పుడు మనం చూస్తున్న ద్వేషానికి ఎంతో ప్రాముఖ్యమైన అర్థం ఉందని బైబిలు చెప్తుంది.
ద్వేషం—మన కాలానికి ఒక గుర్తు
ఈరోజుల్లో ద్వేషం ఎందుకంత సాధారణం అయిపోయిందో బైబిలు రెండు కారణాలు చెప్తుంది.
1. బైబిలు ఆ సమయం గురించి ముందే చెప్పింది అప్పుడు “ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.” (మత్తయి 24:12) ప్రేమ బదులు ప్రజలు ద్వేషాన్ని, దాని లక్షణాలను చూపిస్తున్నారు.—2 తిమోతి 3:1-5.
2. ఇప్పుడు పెరుగుతున్న ద్వేషం వెనక అపవాదియైన సాతాను హానికరమైన, దుష్ట ప్రభావం ఉంది. “లోకమంతా దుష్టుని గుప్పిట్లో ఉంది” అని బైబిలు చెప్తుంది.—1 యోహాను 5:19; ప్రకటన 12:9, 12.
అంతేకాదు దేవుడు ద్వేషాన్ని వేళ్లతో సహా తీసేస్తాడని బైబిలు చెప్తుంది. అంతకుమించి, ఆయన మనకు ద్వేషం వల్ల వచ్చిన నొప్పిని తీసేస్తాడు. బైబిలు ఇలా మాటిస్తోంది:
‘దేవుడు వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.’—ప్రకటన 21:4