కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎడమ వైపు: Olena Yefremkina/stock.adobe.com; మధ్యలో: lunamarina/stock.adobe.com; కుడి వైపు: Rido/stock.adobe.com

అప్రమత్తంగా ఉండండి!

ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?

ఎవర్ని నమ్మవచ్చు?—బైబిలు ఏం చెప్తుంది?

 నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన వాళ్లే ఆశలు అడియాశలు చేసినప్పుడు ‘ఇక ఎవర్నీ నమ్మాలి?’ అనే ప్రశ్న ప్రజల మనసులో తిరుగుతోంది. చాలామందికి వీళ్ల మీద నమ్మకం పూర్తిగా పోయింది:

  •   ప్రజల అవసరాల్ని పక్కన పెట్టేసి, సొంత అవసరాలకు పెద్దపీట వేసే రాజకీయ నాయకులు.

  •   నిజం కంటే అబద్ధాన్నే ఎక్కువ చేసి చూపించే మీడియా వాళ్లు.

  •   ప్రజలకు ప్రయోజనం కల్పించాల్సింది పోయి నష్టం కలిగిస్తున్న సైంటిస్ట్‌లు.

  •   దేవుని గురించే చెప్పే బదులు రాజకీయాలకు గొంతు చించుకుని మద్దతు ఇస్తున్న మతనాయకులు.

 ఎవరినైనా నమ్మే ముందు పదిసార్లు ఆలోచించుకోవడం మంచిదే. బైబిలు కూడా మనకు ఈ జాగ్రత్త చెప్తుంది:

  •   “సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.”—కీర్తన 146:3పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

నమ్మకస్థుడైన ఒక వ్యక్తి

  మీరు నమ్మకం పెట్టుకోగలిగే ఒక వ్యక్తి గురించి బైబిలు చెప్తుంది. ఆయనే యేసుక్రీస్తు! ఆయన వందల సంవత్సరాల క్రితం జీవించిన ఒక మంచి మనిషి మాత్రమే కాదు. దేవుడే యేసును రాజుగా నియమించాడు, ఆయన “ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు.” (లూకా 1:32, 33) యేసు దేవుని రాజ్యానికి రాజు, అది ఇప్పుడు పరలోకం నుండి పరిపాలిస్తున్న ప్రభుత్వం.—మత్తయి 6:10.