కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Justin Paget/​Stone via Getty Images

ఒంటరితనం కారుమబ్బుల్లా కమ్మేస్తోంది—మీరు దాన్ని ఎలా తప్పించుకోవచ్చు?

ఒంటరితనం కారుమబ్బుల్లా కమ్మేస్తోంది—మీరు దాన్ని ఎలా తప్పించుకోవచ్చు?
  •   “అమెరికాలో 18 ఏళ్లు దాటిన వాళ్లలో దాదాపు సగం మంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా 18-25 ఏళ్ల వయసు వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతోంది.”​—అవర్‌ ఎపిడెమిక్‌ ఆఫ్‌ లోన్‌లీనెస్‌ అండ్‌ ఐసోలేషన్‌: ద యు.ఎస్‌. సర్జన్‌ జనరల్స్‌ అడ్వైసరీ ఆన్‌ ద హీలింగ్‌ ఎఫెక్ట్స్‌ ఆఫ్‌ సోషల్‌ కనెక్షన్‌ అండ్‌ కమ్యూనిటీ, 2023.

  •   “ఒంటరితనం అనే జబ్బును అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. నలుగురితో మంచి స్నేహాల్ని సంపాదించుకోమని ప్రజల్ని ప్రోత్సహించడం, పేద దేశాలు-ధనిక దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాల్లో నుండి ఈ ఒంటరితనం అనే జబ్బును రూపుమాపడానికి వీలైనన్ని మంచి పరిష్కారాల్ని కనిపెట్టడం ఆ బృందం బాధ్యత.”—ప్రపంచ ఆరోగ్య సంస్థ, నవంబరు 15, 2023.

 అందరితో మంచిగా ఉంటూ, చక్కని స్నేహాల్ని సంపాదించుకోవడానికి సహాయం చేసే ఎన్నో తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

బైబిల్లోని తెలివైన సలహాలు

 నలుగురి నుండి మిమ్మల్ని దూరం చేసే పనుల్ని తగ్గించుకోండి. ఉదాహరణకు సోషల్‌ మీడియా వాడకాన్ని తగ్గించుకోండి. దానికి బదులు ప్రజల్ని నేరుగా కలిసే అవకాశాల్ని పెంచుకోండి, నిజమైన స్నేహితుల్ని సంపాదించుకోండి.

  •   బైబిలు సలహా: “నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామెతలు 17:17.

 పదిమందికి సహాయం చేసే అవకాశాల్ని వెతకండి. వేరేవాళ్ల కోసం చేసే చిన్నచిన్న పనులు మన స్నేహాల్ని పెంచడమే కాకుండా, మన సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి.

 మంచి స్నేహాల్ని సంపాదించుకోవడానికి సహాయం చేసే మరిన్ని సలహాల కోసం మా వెబ్‌సైట్‌లో వెతకండి.