కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్‌ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది

ఫ్రెండ్స్‌తో ఒంటరితనానికి చెక్‌ పెట్టండి—బైబిలు ఎలా సహాయం చేస్తుంది

 2023 లో ఒంటరితనం పెద్ద జబ్బులా మారిందని వైద్యులు చెప్తున్నారు. మరి, దాన్ని ఎలా నయం చేసుకోవచ్చు?

  •   “మనకు ఒంటరిగా అనిపించి, వేరేవాళ్లకు దూరంగా వెళ్తే మన ఆరోగ్యం, సంతోషం రెండూ పోతాయి. కానీ అలా జరగకుండా ఆపే శక్తి మనకుంది. ప్రతీరోజు చిన్నచిన్న పనులు చేసి వేరేవాళ్లతో మనకున్న బంధాల్ని పెంచుకోవచ్చు” అని డా. వివేక్‌ మూర్తి, US సర్జన్‌ జనరల్‌ చెప్పాడు. a

 ఒంటరితనం అంటే అందరికీ దూరంగా వెళ్లిపోవడమే కాదు. చుట్టూ వందమంది ఉన్నా కొంతమందికి ఒంటరిగానే అనిపిస్తుంది. దానికి కారణం ఏదైనా సరే, బైబిలు సహాయం చేస్తుంది. నలుగురితో మనకున్న స్నేహాల్ని పెంచుకొని, ఒంటరితనాన్ని గెలవడానికి కావాల్సిన మంచి సలహాలు అందులో ఉన్నాయి.

మీకు పనికొచ్చే కొన్ని బైబిలు సూత్రాలు

 నలుగురితో మాటలు కలపండి. అంటే మొత్తం మీరే మాట్లాడాలని కాదు వేరే వాళ్లు చెప్తుంటే శ్రద్ధగా వినండి. వేరే వాళ్లను మీరెంత పట్టించుకుంటే, వాళ్లతో మీ స్నేహబంధం అంత బలంగా ఉంటుంది.

  •   బైబిలు సూత్రం: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 2:4.

 గిరి గీసుకోకండి. చిన్నా-పెద్దా, దేశం-జాతి, సంస్కృతి-సంప్రదాయం అనే తేడాలు లేకుండా అందరితో స్నేహం చేయండి.

 వేరేవాళ్లతో ఈజీగా ఎలా స్నేహం చేయవచ్చో తెలుసుకోడానికి ఇంగ్లీష్‌లో ఉన్న “స్నేహం అనే ఆకలిని తీర్చుకోండి” ఆర్టికల్‌ చదవండి.

a Our Epidemic of Loneliness and Isolation: The U.S. Surgeon General’s Advisory on the Healing Effects of Social Connection and Community, 2023.