కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Ahmad Gharabli/AFP via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

కలవరపెడుతున్న వాతావరణ మార్పుల్ని ప్రభుత్వాలన్నీ కలిసి ఆపగలవా?—బైబిలు ఏం చెప్తోంది?

కలవరపెడుతున్న వాతావరణ మార్పుల్ని ప్రభుత్వాలన్నీ కలిసి ఆపగలవా?—బైబిలు ఏం చెప్తోంది?

 2022, నవంబరు 20, ఆదివారం రోజున, COP27 అంటే ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పర్యావరణ సదస్సు ముగిసింది. పేద దేశాలకు ఆర్థిక సహాయం అందించి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తామని వివిధ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. కానీ వాతావరణ సమస్యకు అది పరిష్కారం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

  •   “వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లకోసం ఆర్థిక సాయం ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అదొక్కటే సరిపోదు . . . ఎందుకంటే మన భూగ్రహం ఒకరకంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది”—ఆంటోన్యో గ్యూటేరెష్‌, ఐక్య రాజ్య సమితి సెక్రటరీ-జనరల్‌, నవంబరు 19, 2022.

  •   “అతి త్వరలో, భూవాతావరణంలో మన ఊహకందని మార్పులు చోటు చేసుకోవచ్చు. దాని ప్రభావం ప్రతీ ఒక్కరి మీద ఉంటుంది.”—మేరీ రాబిన్‌సన్‌, ఐర్లాండ్‌ మాజీ రాష్ట్రపతి, ఐక్య రాజ్య సమితిలో మాజీ మానవ హక్కుల హైకమీషనర్‌, నవంబరు 20, 2022.

 ముఖ్యంగా నేటి యువత మన భూమి పరిస్థితి గురించి ఆందోళన పడుతోంది. మరోవైపు, కలిసికట్టుగా పనిచేసి వాతావరణాన్ని కాపాడతామని ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా మాటిస్తున్నాయి. మరి, ఇచ్చిన మాటను అవి నిలబెట్టుకుంటాయా? బైబిలు ఏం చెప్తోంది?

ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేసి వాతావరణాన్ని కాపాడగలవా?

 ప్రభుత్వాలు ఎంత కష్టపడినా, ఏమి చేసినా వాతావరణం కొద్దోగొప్పో మెరుగవ్వచ్చు గానీ, పూర్తిగా మాత్రం బాగవ్వదు. దానికి రెండు కారణాలు ఉన్నాయి.

  •   “వంకరగా ఉన్నదాన్ని సరిచేయలేం.”—ప్రసంగి 1:15.

     అంటే: ప్రభుత్వాలకు అనుకున్నవన్నీ చేసే శక్తి లేదు. ఎందుకంటే తమను తాము పరిపాలించుకునే సామర్థ్యం మనుషులకు లేదు. (యిర్మీయా 10:23) ప్రభుత్వాలన్నీ కలిసి పనిచేసినా, ఎంత కష్టపడినా అవి ప్రపంచ సమస్యల్ని తీర్చలేవు.

  •   ‘మనుషులు తమను తాము ప్రేమించుకుంటారు, డబ్బును ప్రేమిస్తారు, మొండివాళ్లుగా ఉంటారు.’—2 తిమోతి 3:2, 3.

     అంటే: మన కాలంలో చాలామంది స్వార్థంగా ఉంటారని, కలిసి పనిచేసి ఇతరులకు మంచి చేద్దామనే ఆలోచన వాళ్లకు ఉండదని బైబిలు సరిగ్గానే చెప్పింది.

మనలో ఆశ నింపే ఒక విషయం

 అయితే, భూమి పరిస్థితి మానవ ప్రభుత్వాల మీద ఆధారపడి లేదు. ఈ ప్రపంచాన్ని పాలించడానికి ఒక సమర్థుడైన నాయకుడిని దేవుడు నియమించాడు; ఆయనే యేసుక్రీస్తు. ఆయన గురించి బైబిల్లో ఇలా ఉంది:

  •   “ఆయన భుజం మీద ప్రభుత్వం ఉంటుంది. అద్భుతమైన సలహాదారుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, శాంతికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది.”—యెషయా 9:6, అధస్సూచి.

 దేవుని రాజ్యానికి లేదా ఇంకోలా చెప్పాలంటే, పరలోకం నుండి పరిపాలించే ప్రభుత్వానికి రాజు యేసు. (మత్తయి 6:10) ఆయనకు శక్తి, తెలివితోపాటు భూమిని, దాని మీదున్న వాళ్లను కంటికి రెప్పలా చూసుకోవాలనే కోరిక ఉంది. (కీర్తన 72:12, 16) ఆయన పరలోకం నుండి ఈ భూమిని పరిపాలించినప్పుడు, “భూమిని నాశనం చేస్తున్న” వాళ్లకు అడ్డుకట్ట వేస్తాడు. దాంతోపాటు, పాడైన భూవాతావరణాన్ని బాగుచేసి స్వచ్ఛంగా మారుస్తాడు.—ప్రకటన 11:18; యెషయా 35:1, 7.

 పాడౌతున్న వాతావరణం బాగవ్వాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అదేంటో తెలుసుకోవడానికి, “వాతావరణం పాడౌతోంది! మన భవిష్యత్తు పరిస్థితేంటి?” ఆర్టికల్‌ చదవండి.