కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

కోవిడ్‌ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది—బైబిలు ఏమంటుంది?

కోవిడ్‌ 60 లక్షలమందిని పొట్టనబెట్టుకుంది—బైబిలు ఏమంటుంది?

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్తున్న ప్రకారం 2022, మే 23 నాటికి కోవిడ్‌-19 వల్ల చనిపోయినవాళ్ల సంఖ్య 62 లక్షల 70 వేలు. అయితే, ఆ సంఖ్య అక్కడితో ఆగదని అంతకుముందే 2022, మే 5న ప్రచురించిన వార్తల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. ఆ నివేదిక ప్రకారం 2020, 2021 సంవత్సరాల్లో “కోవిడ్‌ సోకడం వల్ల గానీ, మహమ్మారి సమయంలో వేరే వైద్య సదుపాయాల కొరత వల్ల గానీ చనిపోయినవాళ్ల మొత్తం సంఖ్య . . . దాదాపు 1 కోటి 49 లక్షలు.” గుండెల్ని పిండేసే ఇలాంటి విషాదాల గురించి బైబిలు ఏమైనా చెప్తుందా?

ప్రాణాంతకమైన అంటువ్యాధుల గురించి బైబిలు ముందే చెప్పింది

  •    “చివరి రోజులు” అని బైబిలు పిలిచే కాలంలో, “పెద్దపెద్ద అంటువ్యాధులు” ప్రపంచాన్ని గడగడలాడిస్తాయని యేసు ముందే చెప్పాడు.—లూకా 21:11; 2 తిమోతి 3:1.

 యేసు చెప్పిన మాట ఇప్పుడు నిజమౌతుంది. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, “‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?” అనే ఆర్టికల్‌ చదవండి.

బైబిలు ఓదార్పును ఇస్తుంది

  •    “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు . . . మన కష్టాలన్నిట్లో మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

 ఇష్టమైనవాళ్లను మరణంలో పోగొట్టుకున్న చాలామంది, బైబిలు చెప్పేది తెలుసుకుని ఓదార్పు పొందారు. “బాధని తట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు?” అలాగే “బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు” అనే ఆర్టికల్స్‌లో ఎక్కువ వివరాలు తెలుసుకోండి.

బైబిలు తిరుగులేని పరిష్కారాన్ని ఇస్తుంది

  •    “నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.”—మత్తయి 6:10.

 త్వరలో, “దేవుని రాజ్యం” అందరికీ మంచి ఆరోగ్యం ఉండేలా చూసుకుంటుంది. అప్పుడు ఎవ్వరూ “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు. (మార్కు 1:14,15; యెషయా 33:24) ఆ పరలోక ప్రభుత్వం గురించి, అది చేయబోయే వాటి గురించి తెలుసుకోవడానికి దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.

 ఇలాంటి అద్భుతమైన విషయాలు, తెలివైన సలహాలు బైబిల్లో చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని మీరు, మీ కుటుంబం ప్రయోజనం పొందమని ఆహ్వానిస్తున్నాం.