కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

YURI LASHOV/AFP via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

క్రైస్తవులు యుద్ధం చేయొచ్చా? బైబిలు ఏం చెప్తుంది?

క్రైస్తవులు యుద్ధం చేయొచ్చా? బైబిలు ఏం చెప్తుంది?

 ఈ మధ్య యుక్రెయిన్‌లో జరిగిన పరిస్థితి గమనిస్తే, ప్రజలు ఎవరో ఒకరి పక్షాన ఉండాలని క్రైస్తవ మత పెద్దలు చెప్పారు. రష్యాలో అలాగే యుక్రెయిన్‌లో ఉన్న క్రైస్తవ మత పెద్దలు దాన్నెలా చేశారో గమనిద్దాం.

  •   “శత్రువుల దాడికి తలొగ్గకుండా మన యుక్రెయిన్‌ దేశాన్ని కాపాడుతున్న యుద్ధ వీరులందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాం. వాళ్లను చూసి మేము గర్వపడుతున్నాం . . . మీకు మేమున్నాం, మీ గురించే ఆలోచిస్తూ ప్రార్థనలు చేస్తున్నాం.”—కీవ్‌ నగరంలోని మెట్రోపోలిటన్‌ ఎపిఫేనస్‌ I, ద జెరూసలేమ్‌ పోస్ట్‌లో చెప్పినది, మార్చి 16, 2022.

  •   “రష్యన్‌ ఆర్థొడాక్స్‌ చర్చిని నడిపిస్తున్న ఒక పెద్ద, ఆ దేశ సైనికుల కోసం ఆదివారం రోజున ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందులో, దేశం తరఫున పోరాడమని ప్రోత్సహిస్తూ ఆ పని ‘కేవలం నిజమైన రష్యన్ల వల్లే అవుతుందని’ చెప్పాడు. అప్పటికే, ఒకపక్క యుక్రెయిన్‌పై మాస్కో తమ సైనిక దళంతో దాడిని కొనసాగిస్తుంది.”—ర్యూటర్స్‌, ఏప్రిల్‌ 3, 2022.

 క్రైస్తవులు యుద్ధంలో పాల్గొనవచ్చా? దాని గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు నిజంగా ఏం చెప్తుందంటే . . .

 ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తును అనుసరిస్తే, అతను యుద్ధంలో పాల్గొనడని బైబిలు స్పష్టంగా చెప్తుంది.

  •   “నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు. కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు.”—మత్తయి 26:52.

     దీన్నిబట్టి ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొన్నా, దానికి మద్దతిచ్చినా యేసు మాట విన్నట్టు అవుతుందా?

  •   “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహాను 13:34, 35.

     ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొన్నా దానికి మద్దతిచ్చినా, యేసు తన శిష్యుల మధ్య ఉండాలని చెప్పిన ప్రేమను అతను చూపించినట్టు అవుతుందా?

 మరింత తెలుసుకోవడానికి, “యుద్ధం క్రైస్తవత్వంతో పొసుగుతుందా?” (ఇంగ్లీష్‌) ఆర్టికల్‌ చదవండి.

యుద్ధాలపై నిజక్రైస్తవుల అభిప్రాయం

 నిజక్రైస్తవులు యుద్ధంలో పాల్గొనరు అని అనుకోవడం సరైనదేనా? సరైనదే! మన కాలంలో అంటే “చివరి రోజుల్లోవేర్వేరు దేశాలకు సంబంధించిన ప్రజలు యేసు చెప్పిన బోధల్ని పాటిస్తూ, ‘యుద్ధం చేయడం నేర్చుకోరని’ బైబిలు ముందే చెప్పింది.—యెషయా 2:2, 4.

 యెహోవా a “శాంతికి మూలం.” పరలోకంలో తను స్థాపించిన ప్రభుత్వాన్ని ఉపయోగించి, ప్రజల్ని “అణచివేత నుండి, దౌర్జన్యం నుండి” త్వరలోనే కాపాడతాడు.—ఫిలిప్పీయులు 4:9; కీర్తన 72:14.

a యెహోవా అంటే దేవుని పేరు.—కీర్తన 83:18.