కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Pawel Gluza/500Px Plus/Getty Images

అప్రమత్తంగా ఉండండి!

చెరిగిపోతున్న వన్యప్రాణుల ఆనవాళ్లు—బైబిలు ఏం చెప్తుంది?

చెరిగిపోతున్న వన్యప్రాణుల ఆనవాళ్లు—బైబిలు ఏం చెప్తుంది?

 2024, అక్టోబరు 9న వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫండ్‌ (World Wildlife Fund) అనే సంస్థ, మనుషుల పనుల వల్ల వన్యప్రాణులు ఎంతగా బలైపోతున్నాయో చెప్తూ ఒక రిపోర్టు ఇచ్చింది. గత 50 ఏళ్లలో (1970-2020), వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గిపోయిందని చెప్పింది. ఆ రిపోర్టు ఇలా హెచ్చరించింది: “వచ్చే 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం అనే దానిమీదే, భవిష్యత్తులో ఈ భూమ్మీది జీవరాశుల మనుగడ ఆధారపడి ఉంటుందని బల్లగుద్ది చెప్పవచ్చు.”

 ఇలాంటి రిపోర్టులు వింటున్నప్పుడు ప్రాణం ఉసూరుమంటుంది. మన భూమి ఇంత అందంగా ఉండడానికి అడవి జంతువులు కూడా ఒక కారణం. కాబట్టి అవి అంతరించిపోతున్నాయి అంటే గుండె తరుక్కుపోవడం సహజమే. ఎందుకంటే, జంతువుల్ని చూసుకునే బాధ్యతను దేవుడు మనకు ఇచ్చాడు.—ఆదికాండం 1:27, 28; సామెతలు 12:10.

 కాబట్టి మనకు ఇలా అనిపించవచ్చు: ‘వన్యప్రాణుల్ని మనం కాపాడగలమా? బైబిలు ఏం చెప్తుంది?’

భవిష్యత్తు మీద ఒక ఆశ

 భూమిని, అడవి జంతువుల్ని కాపాడడానికి మనం ఎంత గట్టిగా ప్రయత్నించినా, పూర్తిగా కాపాడలేం. వాటిని పూర్తిస్థాయిలో కాపాడడం దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు ‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను నాశనం చేస్తాడు’ అని బైబిలు చెప్తుంది. (ప్రకటన 11:8) దాన్నుండి మనం రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు:

  1.  1. దేవుడు భూమిని పూర్తిగా పాడు చేయనివ్వడు లేదా నాశనం చేయనివ్వడు.

  2.  2. దేవుడు ఆ పనిని త్వరలోనే చేస్తాడు. అలాగని ఎలా చెప్పగలం? భూమికి, అడవి జంతువులకు ఇదివరకటి కన్నా ఇప్పుడే మనుషుల నుండి ఎక్కువ ముప్పు ఉంది.

 మరి, ఆ ముప్పును దేవుడు ఎలా తప్పిస్తాడు? ఆయన తన పరలోక ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని తీసుకొచ్చి భూమంతటిని పరిపాలిస్తాడు. (మత్తయి 6:10) భూమిని, అడవి జంతువుల్ని ఎలా చూసుకోవాలో ఆ ప్రభుత్వం మంచి మనసున్న వాళ్లకు నేర్పిస్తుంది, శిక్షణ ఇస్తుంది.—యెషయా 11:9.