కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Anna Moneymaker/Getty Images

అప్రమత్తంగా ఉండండి!

శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరిపారు—బైబిలు ఏం చెప్తోంది?

శాస్త్రవేత్తలు డూమ్స్‌డే క్లాక్‌ను ముందుకు జరిపారు—బైబిలు ఏం చెప్తోంది?

 శాస్త్రవేత్తలు 2023 జనవరి 24న, లోకాంతానికి సూచనగా ఉన్న డూమ్స్‌డే క్లాక్‌ను a అర్థరాత్రికి మరింత దగ్గరగా జరిపారు.

  •   “మానవజాతి మీదికి ముంచుకొస్తున్న పెనుముప్పుకు సూచనే ‘డూమ్స్‌ డే క్లాక్‌.’ యుక్రెయిన్‌ యుద్ధం, అణ్వాయుధ యుద్ధ భయం, వాతావరణంలో చోటుచేసుకుంటున్న విపరీత మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మంగళవారం రోజున ఈ క్లాక్‌ను అర్థరాత్రికి మరింత దగ్గరగా జరిపారు.”—AFP ఇంటర్నేషనల్‌ టెక్‌స్ట్‌ వైర్‌.

  •   “మంగళవారం రోజున ’డూమ్స్‌ డే క్లాక్‌ను’ అర్ధరాత్రికి 90 సెకండ్ల దూరంలో సెట్‌ చేశారని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంటే మానవజాతి పూర్తిగా నాశనం అవ్వడానికి ఇంతకుముందు కన్నా మరింత దగ్గరగా ఉంది.”—ABC న్యూస్‌.

  •   “మానవజాతి ఉనికి ముందెప్పటి కన్నా ఇప్పుడు ఎక్కువ ప్రమాదంలో ఉందని ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది.”—ది గార్డియన్‌.

 మానవజాతి అలాగే ఈ భూమి త్వరలో నాశనం అయిపోతాయా? భవిష్యత్తు గురించి మనం భయపడాలా? బైబిలు ఏం చెప్తోంది?

భవిష్యత్తులో అసలేం జరుగుతుంది?

 బైబిలు ప్రకారం, “భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది,” అలాగే ప్రజలు దానిమీద “శాశ్వతంగా జీవిస్తారు.” (ప్రసంగి 1:4; కీర్తన 37:29) కాబట్టి మనుషులు భూమిని నాశనం చేయలేరు, లేదా మనుషులు జీవించడానికి వీల్లేనంతగా దాన్ని పాడుచేయలేరు.

 అయితే, బైబిలు ఒక అంతం గురించి మాట్లాడుతోంది. ఉదాహరణకు, బైబిలు ‘లోకం . . . నాశనం కాబోతుంది’ అని చెప్తుంది.—1 యోహాను 2:17.

పాజిటివ్‌గా ఉండండి

 ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉన్నా, ప్రశాంతంగా ఉండేలా బైబిలు మనకు సహాయం చేస్తుంది. ఎలా?

 బైబిల్లో ఉన్న విషయాల్ని ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు తీసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

a ‘మనం కనిపెట్టిన ప్రమాదకరమైన టెక్నాలజీతో మానవజాతిని నాశనం చేయడానికి మనం ఎంత దగ్గర్లో ఉన్నామో తెలుసుకోవాలని అధికారికంగా ఈ డూమ్స్‌డే క్లాక్‌ను చాలా దేశాల్లో ఒక గుర్తుగా ఉపయోగిస్తున్నారు. ఈ గ్రహం మీద మనం బతికి బట్టకట్టాలంటే, టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాల మీద ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి అనడం అతిశయోక్తి కాదు.’—బులెటిన్‌ ఆఫ్‌ ద ఎటామిక్‌ సైన్‌టిస్ట్స్‌