పర్యావరణ సమస్యలు— దేవుని రాజ్యం ఏం చేస్తుంది?
“వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పుల వల్ల ప్రజలమీద, పట్టణాల మీద, ఇతర పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు మునుపటి కంటే మరింత ఎక్కువ భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి; ఇళ్లని, ప్రజల జీవనాధారాన్ని మట్టిలో కలిపేస్తున్నాయి. అంతేకాదు, సముద్రాలు కూడా విపరీతంగా వేడెక్కుతున్నాయి. దానివల్ల, వాటిలో ఉండే చాలా జీవాలు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది.”—ఇంగర్ ఆండర్సన్, అండర్-సెక్రెటరీ-జనరల్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అండ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద యూఎన్ (UN) ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, 2023, జూలై 25.
ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఈ సమస్యల్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఒక్క తాటి మీదికి వస్తాయా? వాళ్లు శాశ్వత పరిష్కారాల్ని తీసుకురాగలరా?
ఈ భూమ్మీదున్న పర్యావరణ సమస్యలన్నిటినీ పరిష్కరించే సామర్థ్యం ఉన్న ఒక ప్రభుత్వం గురించి బైబిలు మాట్లాడుతుంది; అది వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తుంది అని కూడా చెప్తుంది. భూమ్మీదున్న సమస్యలన్నిటినీ పూర్తిగా తుడిచి పెట్టేయడానికి “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు” అని బైబిలు చెప్తుంది. (దానియేలు 2:44) అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భూమికీ, తోటి మనుషులకీ ‘హాని గానీ నాశనం గానీ చేయరు.’—యెషయా 11:9.