కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

sinceLF/E+ via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

పౌరులను కాపాడేది ఎవరు?—బైబిలు ఏం చెప్తుంది?

పౌరులను కాపాడేది ఎవరు?—బైబిలు ఏం చెప్తుంది?

 ఐక్యరాజ్య సమితి ఇచ్చిన రిపోర్టు ప్రకారం:

  •   2023, అక్టోబరు 7 నుండి అక్టోబరు 23 వరకు గాజా-ఇజ్రాయెల్‌ మధ్య జరిగిన యుద్ధంలో 6,400 మందికి పైగా చనిపోయారు అలాగే 15,200 మందికి పైగా గాయాలయ్యాయి; వాళ్లలో ఎక్కువశాతం మంది అమాయకులైన పౌరులే ఉన్నారు. దాంతోపాటు లక్షలమంది దేశం వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది.

  •   2023, సెప్టెంబరు 24 నాటికి రష్యా, యుక్రెయిన్‌ మధ్య జరిగిన యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లో 9,701 మంది పౌరులు చనిపోయారు అలాగే 17,748 మందికి గాయాలయ్యాయి.

 యుద్ధం వల్ల బాధలు పడుతున్న వాళ్లకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

ఆశతో జీవించడానికి కారణం

 దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు” అని బైబిలు మాటిచ్చింది. (కీర్తన 46:9) మనుషుల ప్రభుత్వాలన్నిటినీ నాశనం చేసి, వాటి స్థానంలో దేవుడు పరలోక ప్రభుత్వాన్ని లేదా రాజ్యాన్ని తీసుకొస్తాడు. (దానియేలు 2:44) దేవుని రాజ్యం మనుషులందరికీ శాంతిని తీసుకొస్తుంది.

 దేవుని రాజ్యానికి రాజైన యేసు క్రీస్తు ఏం చేస్తాడో గమనించండి:

  •   “సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12-14.

 యుద్ధం అలాగే హింస వల్ల కలిగిన దుఃఖాన్ని, బాధల్ని దేవుడు తన ప్రభుత్వం ద్వారా పూర్తిగా తుడిచేస్తాడు.

  •   “వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు. అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”—ప్రకటన 21:4.

 త్వరలో దేవుని రాజ్యం భూమ్మీద పెద్దపెద్ద మార్పుల్ని చేయబోతుంది. నేడు జరుగుతున్న “యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి” బైబిలు ముందే చెప్పింది. (మత్తయి 24:6) ఇవి అలాగే ఇంకొన్ని సంఘటనలు మనం మనుషుల పరిపాలనలోని “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని చూపిస్తున్నాయి.—2 తిమోతి 3:1.