కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Yan Zabolotnyi/stock.adobe.com

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచమంతటా పెరిగిపోతున్న అరాచకాలు—బైబిలు ఏం చెప్తుంది?

ప్రపంచమంతటా పెరిగిపోతున్న అరాచకాలు—బైబిలు ఏం చెప్తుంది?

 నేరగాళ్ల ముఠాల వల్ల హయిటీ రణరంగాన్ని తలపిస్తోంది. దక్షిణ ఆఫ్రికా, మెక్సికో, లాటిన్‌ అమెరికా దేశాల్లో జరుగుతున్న హింసలు, నేరాలు కలకలం రేపుతున్నాయి. హింస తగ్గిపోయిందని అనుకున్న ప్రాంతాల్లో కూడా దొంగతనాలు, దౌర్జన్యాలు, అల్లర్లు జరుగుతుండడం వల్ల ప్రజలకు భద్రత కరువైంది. దాంతో వాళ్లు భయాందోళనలకు గురవుతున్నారు.

 ప్రపంచమంతటా జరుగుతున్న అరాచకాల గురించి బైబిలు ఏం చెప్తుంది?

చెడుతనం గురించి బైబిలు ముందే చెప్పింది

 అక్రమాలు, అరాచకాలు జరగడం “ఈ వ్యవస్థ ముగింపుకు” ఒక సూచన అని బైబిలు ముందుగానే చెప్పింది. (మత్తయి 24:3) ఆ ముగింపు దగ్గరపడే కొద్దీ పరిస్థితులు ఎలా ఉంటాయో వివరిస్తూ, యేసు ఇలా అన్నాడు:

  •   “చెడుతనం పెరిగిపోవడం వల్ల ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.”—మత్తయి 24:12.

 “చివరి రోజుల్లో ... ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు” ఉంటారని కూడా బైబిలు ముందే చెప్పింది. (2 తిమోతి 3:1-5) స్వార్థంగా ఆలోచించే అలాంటి ప్రజల వల్ల, ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయి.

 కానీ, మనం ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ అక్రమాలకు, అరాచకాలకు త్వరలోనే తెర పడబోతుందని బైబిలు మాటిస్తోంది.

  •   “కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు; ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినా వాళ్లు కనిపించరు. అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:10, 11.

 మంచిరోజులు వస్తాయని బైబిలు ఇస్తున్న మాట గురించి తెలుసుకోవడానికి, బైబిలు చెప్పినట్టుగానే నేడు జరుగుతుందని ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోడానికి ఈ ఆర్టికల్స్‌ చూడండి.

 మంచిరోజులు వస్తాయని నిజమైన ఆశ” (ఇంగ్లీషు)

 ‘చివరి రోజులు’ లేదా ‘అంత్యదినముల’ సూచన ఏమిటి?

 ఈ లోకం తీరు గురించి బైబిలు ముందే చెప్పిందా?