కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచవ్యాప్తంగా కాల్పుల కలకలం—బైబిలు ఏం చెప్తుంది?

ప్రపంచవ్యాప్తంగా కాల్పుల కలకలం—బైబిలు ఏం చెప్తుంది?

 2022, జూలైలో, ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కాల్పుల కలకలం రేగింది:

  •   “జపాన్‌ ప్రముఖ రాజకీయవేత్త [మాజీ ప్రధాన మంత్రి షింజో అబె] హత్యతో, దేశమంతా అలాగే ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హింస తక్కువగా ఉండే, తుపాకీ చట్టాలు కఠినంగా ఉండే జపాన్‌లో ఇలా జరగడం షాక్‌కు గురిచేస్తోంది.”—జూలై 10, 2022, ద జపాన్‌ టైమ్స్‌.

  •   “కోపెన్‌హాగన్‌ షాపింగ్‌ మాల్‌లో, ఒక దుండగుడు ముగ్గుర్ని కాల్చి చంపడంతో డెన్మార్క్‌ మొత్తం ఉలిక్కిపడింది.”—జూలై 4, 2022, ర్యూటర్స్‌.

  •   “దక్షిణాఫ్రికా: సోవెటో టౌన్‌షిప్‌లోని ఒక బార్‌లో దుండగులు తుపాకీతో కాల్పులు జరపడంతో 15 మంది చనిపోయారు.”—జూలై 10, 2022, ద గార్డియన్‌.

  •   “యునైటెడ్‌ స్టేట్స్‌లో, జూలై 1-4 మధ్య జరిగిన తుపాకీ కాల్పుల్లో 220 కన్నా ఎక్కువమంది మరణించారు.”—జూలై 5, 2022, CBS న్యూస్‌.

 అలాంటి హింస ఎప్పటికైనా ఆగుతుందా? బైబిలు ఏం చెప్తుంది?

హింసకు ఒక ముగింపు

 మనం జీవిస్తున్న కాలాన్ని బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తుంది. ఈ సమయంలో క్రూరంగా, కిరాతకంగా, అమానుషంగా ప్రవర్తించేవాళ్లు ఉంటారు. (2 తిమోతి 3:1, 3) దానివల్ల ప్రజలు అనుక్షణం భయపడుతూ బ్రతుకుతారు. (లూకా 21:11) అయితే, హింసకు ఒక ముగింపు ఉందని, అప్పుడు “ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో, సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు” అని బైబిలు మాటిస్తుంది. (యెషయా 32:18) ఇంతకీ, హింస ఎలా పోతుంది?

 దేవుడు చెడ్డవాళ్లను తీసేస్తాడు, ఆయుధాలన్నిటినీ ముక్కలుముక్కలు చేస్తాడు.

  •   “దుష్టులు భూమ్మీద ఉండకుండా నాశనం చేయబడతారు.”—సామెతలు 2:22.

  •   “[దేవుడు] భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు. విల్లును విరగ్గొడతాడు, ఈటెను ముక్కలుముక్కలు చేస్తాడు, యుద్ధ రథాల్ని అగ్నిలో కాల్చేస్తాడు.”—కీర్తన 46:9.

 శాంతిగా ఎలా జీవించాలో ప్రజలకు నేర్పించడం ద్వారా, దేవుడు హింసను కూకటివేళ్లతో సహా తీసేస్తాడు.

  •   “నా పవిత్ర పర్వతమంతటి మీద అవి హాని గానీ నాశనం గానీ చేయవు, ఎందుకంటే సముద్రం నీళ్లతో నిండివున్నట్టు భూమి యెహోవా గురించిన జ్ఞానంతో నిండిపోతుంది.”—యెషయా 11:9.

  •   ఇప్పుడు కూడా, దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు హింసను-ఆయుధాల్ని విడిచిపెట్టడం, “తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా” మార్చుకోవడం నేర్పిస్తున్నాడు.—మీకా 4:3.

 భయమే ఉండని లోకం గురించి బైబిలు ఏం మాటిస్తుందో తెలుసుకోవడానికి, “భయమే ఉండని లోకం—అది సాధ్యమేనా?” (ఇంగ్లీషు) అనే ఆర్టికల్‌ చదవండి.

 హింస పూర్తిగా ఎప్పుడు పోతుందో తెలుసుకోవడానికి, “చివరకు భూమ్మీద శాంతి!” అనే ఆర్టికల్‌ చదవండి.