కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Ismail Sen/Anadolu Agency via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

టర్కీ, సిరియాల్ని అతలాకుతలం చేసిన భూకంపాలు—బైబిలు ఏం చెప్తుంది?

టర్కీ, సిరియాల్ని అతలాకుతలం చేసిన భూకంపాలు—బైబిలు ఏం చెప్తుంది?

 2023 ఫిబ్రవరి 6, సోమవారం టర్కీ, సిరియా దేశాల్లో భయంకరమైన భూకంపాలు వచ్చాయి.

  •   “సోమవారం టర్కీ చుట్టూ అలాగే సిరియా వాయువ్య దిక్కులో వచ్చిన ఒక పెద్ద భూకంపం వల్ల 3,700 కన్నా ఎక్కువమంది చనిపోయారు. దానికితోడు ఎముకలు కొరికే చలి ఉండడంతో, భూకంపం వల్ల గాయపడిన లేదా ఇళ్లని కోల్పోయిన వేలమంది పరిస్థితి ఘోరంగా తయారైంది. తీవ్రంగా ఉన్న ఆ చలి వల్ల ఎవరైనా బతికున్నారా లేదా అనేది కనిపెట్టడం కష్టంగా మారింది.”—ర్యూటర్స్‌, 2023 ఫిబ్రవరి 6.

 అలాంటి విషాదాలు జరిగినప్పుడు మన గుండె తరుక్కుపోతుంది. ఆ సమయంలో, మనం ‘ఓదార్పును ఇచ్చే దేవుడైన’ యెహోవా a మీద ఆధారపడొచ్చు. (2 కొరింథీయులు 1:3) ఆయన మనకు “లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల . . . నిరీక్షణ” ఇస్తాడు.—రోమీయులు 15:4.

 బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి:

  •   భూకంపాల గురించి ముందే ఏం చెప్పారు?

  •   మనకి కావాల్సిన ఓదార్పు, ఆశ ఎక్కడ దొరుకుతుంది?

  •   బాధలన్నిటినీ దేవుడు ఎలా తీసేస్తాడు?

 వీటి గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, ఈ ఆర్టికల్స్‌ చదవండి:

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.