కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచవ్యాప్తంగా మండుతున్న ధరలు—బైబిలు ఏం చెప్తుంది?

ప్రపంచవ్యాప్తంగా మండుతున్న ధరలు—బైబిలు ఏం చెప్తుంది?

 “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ ప్రమాదంలో పడింది. ఒకపక్క ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి, మరోపక్క నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ప్రజల దగ్గర డబ్బు ఉండట్లేదు” అని 2022 జూన్‌ నివేదికలో, వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌ అధ్యక్షుడు హెచ్చరించాడు.

 “ఇంధన ధరలు, ఆహార ధరలు అమాంతం పెరిగిపోవడం వల్ల, పేద దేశాల్లోని సామాన్య ప్రజలపై ఎక్కువ భారం పడుతోంది” అని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ అనే సంస్థ చెప్పుకొచ్చింది.

 అలాంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో, వాటిని ఎలా తట్టుకోవచ్చో, వాటికి శాశ్వత పరిష్కారం ఏంటో బైబిలు చెప్తుంది.

“చివరి రోజుల్లో” పెరుగుతున్న ధరలు

  •   మనం జీవిస్తున్న కాలాన్ని, బైబిలు “చివరి రోజులు” అని పిలుస్తుంది.—2 తిమోతి 3:1.

  •   ఈ కాలంలో, “భయంకరమైన దృశ్యాలు” లేదా భయపెట్టే సంఘటనలు చోటు చేసుకుంటాయని యేసు చెప్పాడు. (లూకా 21:11) ధరలు విపరీతంగా పెరిగినప్పుడు ప్రజలు భయపడతారు. ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందో, తమ కుటుంబాన్ని పోషించుకోగలమో లేదో అని వాళ్లు కంగారుపడతారు.

  •   ఈ కాలంలో, ఆహార ధరలు పెరిగిపోతాయని ప్రకటన పుస్తకం ముందే చెప్పింది: “ఒక స్వరం ‘రోజు కూలికి ఒక్క కిలో గోధుమలు రోజు కూలికి మూడు కిలోల యవలు …’ అని చెప్పినట్టు విన్నాను.”—ప్రకటన 6:6, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

 “చివరి రోజుల” గురించి, ప్రకటన పుస్తకంలో ఉన్న ప్రవచనం గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, 1914 నుండి లోకం మారిపోయింది అనే వీడియో చూడండి. అలాగే “నాలుగు గుర్రాల మీద స్వారీ చేస్తున్న వ్యక్తులు ఎవరు?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చదవండి.

ఆర్థిక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం

  •   “వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు. వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు.”—యెషయా 65:21, 22.

  •   “భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది; పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది.”—కీర్తన 72:16.

  •   “యెహోవా ఇలా అంటున్నాడు: ‘బాధితులు అణచివేయబడుతున్నారు, పేదవాళ్లు నిట్టూర్పులు విడుస్తున్నారు. కాబట్టి, నేను చర్య తీసుకోవడానికి లేస్తాను.’”—కీర్తన 12:5. a

 త్వరలో, దేవుడు ఏదో ఒక్క దేశంలోనే కాదుగానీ భూవ్యాప్తంగా ఆర్థిక సమస్యలకు ముగింపు పలకబోతున్నాడు. అదెలాగో తెలుసుకోవడానికి “పేద-ధనిక తేడాలు లేని సమాజం సాధ్యమేనా?” (ఇంగ్లీష్‌) అనే ఆర్టికల్‌ చదవండి.

 అయితే ఇప్పుడు కూడా, పెరుగుతున్న ధరల విషయంలో బైబిలు మీకు సహాయం చేయగలదు. ఎలా? డబ్బును పొదుపుగా వాడే విషయంలో బైబిలు ఉపయోగపడే సలహాలు ఇస్తుంది. (సామెతలు 23:4, 5; ప్రసంగి 7:12) ఎక్కువ తెలుసుకోవడానికి, “పొదుపుగా జీవించండి” అలాగే “ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?” అనే ఆర్టికల్స్‌ చదవండి.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.