అప్రమత్తంగా ఉండండి!
మారణహోమంలో యెహోవాసాక్షుల్ని చంపేయడం—బైబిలు ఏం చెప్తోంది?
2023 జనవరి, 27న అంతర్జాతీయ హోలోకాస్ట్ రిమెంబరెన్స్ డే (మారణహోమం బాధితుల్ని గుర్తుచేసుకునే రోజు) జరుపుకుంటారు. 75కన్నా ఎక్కువ ఏళ్ల క్రితం జరిగిన ఆ దారుణాన్ని దేవుడు ఎందుకు ఆపలేదు అని మీకు అనిపించవచ్చు.
బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి “మారణహోమం ఎందుకు జరిగింది? దేవుడు దాన్ని ఎందుకు ఆపలేదు?” అనే ఆర్టికల్ చదవండి.
ఎంతోమంది యూదులు ఈ మారణహోమంలో బలయ్యారు. ఒక పథకం ప్రకారం లక్షలమందిని చంపేశారు. ఈ మారణహోమంలో వేరే గుంపుల వాళ్లను కూడా లక్ష్యంగా చేసుకుని, చంపేశారు. అందులో ఒక గుంపు యెహోవాసాక్షులు. వాళ్ల బైబిలు నమ్మకాల్ని బట్టి వాళ్లను హింసించారు.
ఎక్కువ తెలుసుకోవడానికి “మారణహోమం సమయంలో యెహోవాసాక్షులకు ఏమి జరిగింది?” అనే ఆర్టికల్ చూడండి.
మంచిరోజులు వస్తాయి
అలాంటి మారణహోమం మళ్లీ జరుగుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు. అయితే అలాంటి దారుణాలేమీ జరగని మంచిరోజులు వస్తాయని బైబిలు చెప్తుంది.
“‘ఎందుకంటే, నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను. మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’ అని యెహోవా అంటున్నాడు.”—యిర్మీయా 29:11. a
దేవుడు చెడుతనం అంతటినీ తీసేసి, చెడ్డవాళ్ల వల్ల జరిగిన నష్టాన్ని సరిచేసినప్పుడు ఆ మాటలు నిజమౌతాయి. ఆయన త్వరలోనే ...
మోసం చేసే వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాడు.—సామెతలు 2:22.
బాధకు గురైన వాళ్ల గుండె కోతను మాన్పుతాడు.—ప్రకటన 21:4.
చనిపోయినవాళ్లను తిరిగి బ్రతికిస్తాడు.—యోహాను 5:28, 29.
బైబిలు చెప్పే ఈ ఓదార్పుకరమైన మాటల్ని మీరు నమ్మవచ్చు. ఎందుకు నమ్మవచ్చో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ఇచ్చే బైబిలు స్టడీ కోర్సు తీసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.