కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Sean Gladwell/Moment via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

ప్రపంచవ్యాప్తంగా మిలటరీ ఖర్చు 2 ట్రిలియన్‌ డాలర్లు దాటేసింది—బైబిలు అభిప్రాయం ఏంటి?

ప్రపంచవ్యాప్తంగా మిలటరీ ఖర్చు 2 ట్రిలియన్‌ డాలర్లు దాటేసింది—బైబిలు అభిప్రాయం ఏంటి?

 యుక్రెయిన్‌ మీద రష్యా చేస్తున్న యుద్ధం వల్ల, 2022లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు మిలిటరీ ఖర్చు కోసం రికార్డు స్థాయిలో 2.24 ట్రిలియన్‌ అమెరికా డాలర్లని (లేదా దాదాపు 186 లక్షల కోట్ల రూపాయల్ని) ఖర్చు చేశాయి. 2023 ఏప్రిల్‌ నెలలో, స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (SIPRI) విడుదల చేసిన ఒక రిపోర్ట్‌ ప్రకారం, 2022లో:

  •   యూరప్‌ దేశాల మిలిటరీ ఖర్చు “ఆ సంవత్సరంలో 13 శాతం పెరిగింది. ప్రచ్ఛన్న యుద్ధం (cold war) తర్వాత యూరప్‌లో ఉన్న దేశాలన్నీ ఒక్క సంవత్సరంలో అత్యంత ఎక్కువ ఖర్చుపెట్టింది ఇప్పుడే.”

  •   “రష్యా...9.2 శాతం ఎక్కువ ఖర్చుపెట్టి, ప్రపంచంలోనే మిలిటరీ కోసం భారీగా ఖర్చు పెట్టిన దేశాల్లో అయిదు నుండి మూడవ స్థానానికి ఎగబాకింది.”

  •   మిలిటరీ కోసం చేసిన ఖర్చులో అమెరికా మొదటి స్థానంలో ఉండడంతో పాటు, ప్రపంచ దేశాల మిలిటరీ ఖర్చులో వాళ్లదే 39 శాతం ఉంది.”

 “గడిచిన కొన్ని సంవత్సరాల్లో, ప్రభుత్వాలు మిలిటరీ మీద చేస్తున్న ఖర్చు పెరగడాన్ని చూస్తుంటే, ప్రపంచంలోని పరిస్థితులు మరింత ఆందోళనకరంగా తయారౌతున్నాయి” అని సిప్రీ (SIPRI) రిపోర్ట్‌ని రాసినవాళ్లలో ఒకరైన డా. నాన్‌ టియెన్‌ అన్నాడు.

 ప్రపంచ శక్తుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని బైబిలు ముందే చెప్పింది అలాగే ఏది మాత్రమే శాంతిని తిరిగి తీసుకురాగలదో కూడా చెప్పింది.

సైన్యాల మధ్య పెరిగిన శత్రుత్వం గురించి బైబిలు ముందే చెప్పింది

  •   బైబిలు మనం జీవిస్తున్న కాలాన్ని, “అంత్యకాలం” అని పిలుస్తుంది.దానియేలు 8:19.

  •   దానియేలు పుస్తకం ప్రపంచ శక్తుల మధ్య పోరాటాలు జరుగుతాయని ముందే చెప్పింది. ఈ ప్రపంచ శక్తులు ఒకదానిమీద మరొకటి పైచేయి సాధించడానికి ‘పోరాటం చేస్తాయి.’ అలా తలపడడానికి విస్తారంగా ‘ఖజానాల్ని’ లేదా ఆర్థిక వనరుల్ని ఖర్చు చేస్తాయి.—దానియేలు 11:40, 42, 43.

 ఆసక్తికరమైన ఈ ప్రవచనం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, నెరవేరిన ప్రవచనాలు—దానియేలు 11వ అధ్యాయం అనే వీడియోని చూడండి.

నిజమైన శాంతి ఎలా వస్తుంది?

  •   దేవుడు ఈ మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసేస్తాడని బైబిలు చెప్తుంది. ఆయన “ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు. ఆ రాజ్యం వేరే ఏ ప్రజల చేతుల్లోకి వెళ్లదు. అది ఆ రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దానియేలు 2:44.

  •   యెహోవా a దేవుడు మనుష్యులు ఎప్పటికీ తీసుకురాలేని నిజమైన శాంతిని తెస్తాడు. ఎలా? ఆయన పరలోక ప్రభుత్వం ఆయుధాల్ని నామరూపాల్లేకుండా చేసి, హింసకి ఫుల్‌స్టాప్‌ పెడుతుంది.—కీర్తన 46:8, 9.

 దేవుని రాజ్యం ఏం సాధిస్తుందో ఎక్కువ తెలుసుకోవడానికి, దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’” అనే ఆర్టికల్‌ చదవండి.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.