కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Photo by Zhai Yujia/China News Service/VCG via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

ముంచెత్తుతున్న వరదలు—బైబిలు ఏం చెప్తుంది?

ముంచెత్తుతున్న వరదలు—బైబిలు ఏం చెప్తుంది?

 ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ కింది రిపోర్టులు చూడండి:

  •   “చైనా రాజధానిలో గత 140 ఏళ్లలో పడిన వర్షాల్ని గమనిస్తే, గడిచిన శనివారం నుండి బుధవారం వరకు విపరీతంగా వర్షాలు కురిశాయి. ఆ వర్షపాతం 744.8 మిల్లీమీటర్లుగా (29.3 అంగుళాలు) నమోదయ్యింది.”—ఏపీ న్యూస్‌, 2023, ఆగస్టు 2.

  •   “ఖానున్‌ తుఫాను వల్ల దక్షిణ జపాన్‌లో రెండో రోజు గురువారం, భారీగా వర్షాలు పడ్డాయి అలాగే బలమైన గాలులు వీచాయి. దాంతో ఇద్దరు వ్యక్తులు తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఆ తుఫాను వల్ల, తైవాన్‌ దేశం మధ్యలో ఉన్న పర్వతప్రాంతంలో 0.6 మీటర్ల (2 అడుగులు) వర్షపాతం నమోదౌతుందని అంచనా.”—డోయిచ వెల్లీ, 2023, ఆగస్టు 3.

  •   “గడిచిన వారాంతంలో అట్లాంటిక్‌ తీరంలోని కెనడా ప్రాంతం వైపు, గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత తీవ్రంగా వర్షాలు కురిశాయి. దానివల్ల [నోవా స్కోటియాలో] విపరీతంగా వరదలు వచ్చాయి.”—బీబీసి న్యూస్‌, 2023, జూలై 24.

 ఇలాంటి సంఘటనల గురించి బైబిలు ఏం చెప్తుంది?

‘చివరి రోజులకు’ గుర్తు

 మనం జీవిస్తున్న కాలాన్ని బైబిలు “చివరి రోజులు“ అని పిలుస్తుంది. (2 తిమోతి 3:1) ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో ‘భయంకరమైన దృశ్యాల్ని, ఆకాశంలో గొప్ప సూచనల్ని’ చూస్తామని యేసు ముందే చెప్పాడు. (లూకా 21:11) వాతావరణ మార్పుల వల్ల పర్యావరణంలో ఊహించని విధంగా, తరచుగా, తీవ్రంగా భయంకరమైన విపత్తులు వస్తున్నాయి.

ఆశకు ఓ కారణం

 నేడు భూమ్మీద జరుగుతున్న ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనలో ఒక ఆశను నింపుతాయని బైబిలు చెప్తుంది. ఎందుకు? యేసు ఇలా అన్నాడు: “ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరపడిందని తెలుసుకోండి.”—లూకా 21:31; మత్తయి 24:3.

 ఇప్పుడు మన కళ్లముందు జరుగుతున్న సంఘటనలు, త్వరలోనే దేవుని ప్రభుత్వం నీటి చక్రంతో సహా భూమ్మీదున్న ప్రకృతి శక్తులన్నిటినీ పూర్తిగా అదుపు చేస్తుందని గుర్తు చేస్తున్నాయి.—యోబు 36:27, 28; కీర్తనలు 107:29.

 వాతావరణ సమస్యల్ని దేవుని ప్రభుత్వం ఎలా సరిచేస్తుందో తెలుసుకోవడానికి ఇంగ్లీష్‌లో ఉన్న “భూమిని ఎవరు కాపాడతారు?” అనే ఆర్టికల్‌ని చదవండి.