కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Chris McGrath/Getty Images

యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

యుద్ధాలు—దేవుని రాజ్యం ఏం చేస్తుంది?

 ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు తీరని బాధను, నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకసారి ఈ కింది రిపోర్టులు చూడండి:

  •   “ముఖ్యంగా ఇతియోపియా అలాగే యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాల కారణంగా చనిపోతున్న వాళ్ల సంఖ్య, ముందెప్పుడూ లేనంతగా 28 శాతం పెరిగిందని కొత్త గణాంకాలు చూపిస్తున్నాయి.“—పీస్‌ రీసర్చ్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఓస్లో, 2023, జూన్‌ 7.

  •   “2022 లో జరిగిన యుద్ధాల్ని గమనిస్తే, ఒక్క యుక్రెయిన్‌ యుద్ధం వల్లే తీవ్రమైన నష్టం కలిగింది. ఎలా చూసుకున్నా, రాజకీయాల వల్ల పెరుగుతున్న హింస, అంతకుముందు కన్నా, గత సంవత్సరం 27 శాతం పెరిగింది. దాని ప్రభావం 170 కోట్లమంది ప్రజల మీద పడింది.”—ది ఆర్మ్‌డ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ లొకేషన్‌ & ఈవెంట్‌ డేటా ప్రాజెక్ట్‌ (ACLED), 2023, ఫిబ్రవరి 8.

 బైబిలు మనకు ఓ ఆశను ఇస్తుంది. అది “పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎప్పటికీ నాశనం కాదు” అని చెప్తుంది. (దానియేలు 2:44) ఆ ప్రభుత్వంలో దేవుడు “భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.”—కీర్తనలు 46:9.