కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అప్రమత్తంగా ఉండండి!

రాజకీయాలు మనుషుల మధ్య అడ్డుగోడలు సృష్టిస్తున్నాయి ఎందుకు?—బైబిలు ఏం చెప్తోంది?

రాజకీయాలు మనుషుల మధ్య అడ్డుగోడలు సృష్టిస్తున్నాయి ఎందుకు?—బైబిలు ఏం చెప్తోంది?

 ప్రపంచంలో ఏ మూలకెళ్లినా, రాజకీయాల వల్ల ప్రజల మధ్య ఏర్పడిన అడ్డుగోడలు అడుగడుగునా కనిపిస్తాయి. ప్యూ రీసర్చ్‌ సెంటర్‌ సర్వే చేసినప్పుడు 19 దేశాల్లో 65 శాతం కన్నా ఎక్కువమంది పెద్దవాళ్లు చెప్పిన విషయమేంటంటే, ఒకే దేశ ప్రజలైనప్పటికీ ఒక రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవాళ్ల అభిప్రాయాలు, మరో రాజకీయ పార్టీకి మద్దతిచ్చేవాళ్ల అభిప్రాయాలతో అస్సలు కలవవు అని, వాళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందని అన్నారు.

 మీ ప్రాంతంలో కూడా, రాజకీయాలు ప్రజల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని మీరు గమనించారా? దానికి కారణం ఏంటి? పరిష్కారం ఏదైనా ఉందా? బైబిలు ఏం చెప్తోందో ఒకసారి గమనించండి.

ఆలోచనాతీరులే అడ్డుగోడలుగా మారుతున్నాయి

 ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలాన్ని బైబిలు ’చివరి రోజులు’ అని పిలుస్తోంది. మనకాలంలోని ప్రజల ఆలోచనాతీరు వల్ల ఐక్యత అసాధ్యంగా మారుతుందని బైబిలు ముందుగానే చెప్పింది.

  •   “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, . . . మొండివాళ్లు.”—2 తిమోతి 3:1-3.

 ఎంతోమంది నిజాయితీగా కష్టపడుతున్నా ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని తీర్చలేకపోతున్నాయి. ఎందుకంటే ఆలోచనలు కలవనప్పుడు కలిసిమెలిసి పనిచేయడం, సమస్యల్ని పరిష్కరించడం అసాధ్యం. చివరికి బైబిలు ఎంతోకాలం క్రితం చెప్పిన ఈ మాటే నిజమౌతోంది:

  •   “మనిషి ఇంకో మనిషి మీద అధికారం చెలాయించి తనకు హాని చేసుకున్నాడు.”—ప్రసంగి 8:9.

 అయితే త్వరలో ఒక ప్రభుత్వం ఈ సమస్యలన్నిటికీ ముగింపు పలుకుతుందని బైబిలు చెప్తోంది. ఆ ప్రభుత్వాన్ని నడిపించే నాయకుడికి, ప్రజల్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నిటినీ పూర్తిగా పరిష్కరించే సామర్థ్యం ఉంది.

ప్రజల మీద శ్రద్ధ, వాళ్లను పరిపాలించే అర్హత ఉన్న నాయకుడు

 ప్రజల సమస్యలన్నిటినీ తీర్చే ప్రత్యేక సామర్థ్యం ఒక నాయకునికి ఉందని బైబిలు చెప్తోంది. ఆయనే యేసుక్రీస్తు. మనుషులందర్నీ ఒక్కటి చేసి, శాంతిగా ఉండేలా చేసే శక్తి, అధికారం, కోరిక యేసుకు ఉన్నాయి.

  •   “ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు, . . . శాంతి విస్తరిస్తుంది.”—కీర్తన 72:7.

  •   “అన్ని దేశాలవాళ్లు ఆయన్ని సేవిస్తారు.”—కీర్తన 72:11.

 అన్నివిధాలా యేసే మనకు సరైన నాయకుడు. ఎందుకంటే ఆయనకు ప్రజలంటే పట్టింపు, వాళ్లకు సహాయం చేయాలనే కోరిక ఉన్నాయి. ముఖ్యంగా, అన్యాయానికి గురైనవాళ్లను ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటాడు.

  •   “సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు, పేదవాళ్ల ప్రాణాల్ని కాపాడతాడు. అణచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్లను రక్షిస్తాడు.”—కీర్తన 72:12-14.

 దేవుని రాజ్యం లేదా యేసు నాయకునిగా ఉండే పరలోక ప్రభుత్వం గురించి ఎక్కువ తెలుసుకోండి. ఆయన పరిపాలన నుండి మీరెలా మేలు పొందవచ్చో, ఆ పరిపాలనకు ఎలా మద్దతివ్వవచ్చో కూడా తెలుసుకోండి.