కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Rui Almeida Fotografia/Moment via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

రాజకీయ దాడులు—బైబిలు ఏం చెప్తుంది?

రాజకీయ దాడులు—బైబిలు ఏం చెప్తుంది?

 పెరుగుతున్న రాజకీయ హత్యలు-దాడులు లోకాన్ని వణికిస్తున్నాయి.

  •   2023-2024 ఎన్నికల సమయంలో మెక్సికోలో 39 మంది రాజకీయ అభ్యర్థులు హత్య చేయబడ్డారు. ముందెప్పుడూ జరగని ఈ సంఘటనల వల్ల అందరికీ దడ పట్టుకుంది.

  •   ఈమధ్య యూరప్‌లో రాజకీయ దాడుల మోత మోగుతుంది. ఉదాహరణకు, 2024 మే 15న స్లోవేకియ ప్రధాన మంత్రిపై హత్యాప్రయత్నం జరిగింది.

  •   2024, సెప్టెంబరు 15న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని చంపడానికి రెండోసారి కుట్ర పన్నడంతో అమెరికా ఉలిక్కిపడింది.

 రాజకీయ దాడులు ఎందుకు ఇంత పెరిగిపోయాయి? అవి ఎప్పటికైనా ఆగుతాయా? బైబిలు ఏం చెప్తుంది?

రాజకీయ దాడుల గురించి బైబిలు ముందే చెప్పింది

 మన కాలాన్ని “చివరి రోజులు” అని పిలుస్తూ ఈ సమయంలో హింసకు, గొడవలకు దారితీసే అవలక్షణాలు ప్రజల్లో ఉంటాయని బైబిలు ముందే చెప్పింది.

  •   “చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: . . . కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, . . . మొండివాళ్లు, . . . క్రూరులు, . . . నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు.”—2 తిమోతి 3:1-4.

 ఈ సమయంలో రాజకీయ గొడవలు, తిరుగుబాట్లు లాంటి అల్లకల్లోలమైన పరిస్థితులు సర్వసాధారణం అయిపోతాయని కూడా బైబిలు ముందే చెప్పింది. (లూకా 21:9, అధస్సూచి) కానీ ఈ రాజకీయ గందరగోళం ఒకరోజు ఆగిపోతుంది.

రాజకీయ దాడులకు చెక్‌ పడుతుంది

 దేవుడు మానవ ప్రభుత్వాల్ని తీసేసి, తన పరలోక ప్రభుత్వాన్ని తీసుకొస్తాడని బైబిలు వివరిస్తుంది.

  •   “దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, . . . అది ఆ [వేరే] రాజ్యాలన్నిటినీ నలగ్గొట్టి నాశనం చేస్తుంది, అదొక్కటే ఎప్పటికీ నిలుస్తుంది.”—దానియేలు 2:44.

 దేవుని రాజ్యం ప్రజలందర్నీ ఒకటి చేసి, భూమంతటా శాంతిని తీసుకొస్తుంది.

  •   ఆ రాజ్యానికి రాజైన యేసుక్రీస్తుకు “శాంతికి అధిపతి” అనే పేరు కూడా ఉంది. ఆయన ‘అంతులేని శాంతి ఉండేలా’ చూసుకుంటాడు.—యెషయా 9:6, 7.

  •   ఇప్పుడు కూడా, ఆ రాజ్యానికి చెందిన పౌరులు శాంతిగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నారు. అందుకే బైబిలు ఇలా చెప్తుంది: “వాళ్లు తమ ఖడ్గాల్ని నాగటి నక్కులుగా, తమ ఈటెల్ని మచ్చుకత్తులుగా సాగగొడతారు. దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు, వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.”—యెషయా 2:3, 4.

 ఎక్కువ తెలుసుకోవడానికి “దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?” అనే ఆర్టికల్‌ చదవండి, దేవుని రాజ్యం అంటే ఏమిటి? అనే వీడియో చూడండి.