కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

fcafotodigital/E+ via Getty Images

వీగన్‌ లైఫ్‌స్టైల్‌—బైబిలు ఏం చెప్తుంది?

వీగన్‌ లైఫ్‌స్టైల్‌—బైబిలు ఏం చెప్తుంది?

 ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీగన్‌ లైఫ్‌స్టైల్‌ మీద ఆసక్తి చూపిస్తున్నారు.

  •   “వీగన్‌ లైఫ్‌స్టైల్‌ అనేది ఒక సిద్దాంతంలా, జీవన విధానంలా తయారౌతుంది. దాన్ని పాటించేవాళ్లు జంతువులతో క్రూరంగా ఉండరు; లేదా వాటి నుంచి వచ్చే ఆహారాన్నీ, బట్టల్నీ, వేరే దేన్నీ ఉపయోగించరు.”—ది వీగన్‌ సొసైటీ.

 కొంతమంది ప్రజలు, జంతువుల మీద ప్రేమతోనే కాకుండా, పర్యావరణాన్ని కాపాడడం కోసం, తమ ఆరోగ్యం కోసం లేదా మతపరమైన కారణాల కోసం వీగన్‌ లైఫ్‌స్టైల్‌ని అలవాటు చేసుకుంటున్నారు.

  •   “ఇతర ఆహార అలవాట్లతో పోలిస్తే, వీగన్‌ లైఫ్‌స్టైల్‌ని పాటించేవాళ్ల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. అలాంటివాళ్లు దీన్ని ఒక నమ్మకంలా, నైతిక బాధ్యతలా, ప్రపంచంలో మంచి మార్పు రావడానికి ప్రతిఒక్కరూ పాటించాల్సిన మార్గమని అనుకుంటారు.”—బ్రిటానికా అకాడమీ.

 ఈ భూమ్మీదున్న సమస్యలకు వీగన్‌ లైఫ్‌స్టైలే పరిష్కారమా? బైబిలు ఏం చెప్తుంది?

మనుషులు, జంతువులు విషయంలో సృష్టికర్త అభిప్రాయం ఏంటి?

 మనుషుల్ని తయారుచేసిన యెహోవా, a జంతువుల కన్నా మనుషుల్నే ఎక్కువ విలువైన వాళ్లుగా చూస్తాడని బైబిలు చెప్తుంది. ఆ కారణం వల్లే మనుషులకు జంతువుల మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు. (ఆదికాండం 1:27, 28) కొంతకాలం తర్వాత, జంతువుల్ని ఆహారంగా తినడానికి దేవుడు మనుషులకు అనుమతినిచ్చాడు. (ఆదికాండం 9:3) అయితే, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే మాత్రం ఆయన అస్సలు ఊరుకోడు.—సామెతలు 12:10.

 బైబిలు ప్రకారం, జంతువుల్ని తినాలా వద్దా అనేది మన నిర్ణయం. b అయితే మనం ఏం తింటామనే దాన్నిబట్టి, దేవుడు ఇతరుల కన్నా మనల్ని గొప్పవాళ్లుగా ఏమీ చూడడు. (1 కొరింథీయులు 8:8) ఇతరులు ఏం తింటారు అనే దాన్ని బట్టి మనం వాళ్లను విమర్శించకూడదు.—రోమీయులు 14:3.

మంచి భవిష్యత్తు కోసం మార్గం

 మన జీవన విధానాన్ని బట్టి ఈ లోకంలోని సమస్యల్ని మార్చలేం. ఎందుకంటే, చాలావరకు సమస్యలు రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాల వల్ల వస్తున్నాయి. వాటిని సరిచేయడం ఎవ్వరివల్లా కాదు. దానిగురించి బైబిలు ఇలా చెప్తుంది:

 మనం ఎదుర్కొంటున్న సమస్యల్ని సృష్టికర్త సరిచేస్తాడు. దానిగురించి బైబిలు ఉదాహరణ రూపంలో ఇలా చెప్తుంది:

  •   “అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను. ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి; సముద్రం ఇక లేదు.”—ప్రకటన 21:1.

 దేవుడు “పాత ఆకాశాన్ని” లేదా మానవ ప్రభుత్వాల్ని తీసేసి వాటి స్థానంలో “కొత్త ఆకాశాన్ని” అంటే తన పరలోక ప్రభుత్వాన్ని తీసుకొస్తాడు. ఆయన రాజ్యం “పాత భూమిని” సూచించే చెడ్డ ప్రజల్ని తీసేస్తుంది. దానికి బదులు, అది “కొత్త భూమిని” లేదా దేవుని అధికారానికి ఇష్టపూర్వకంగా లోబడేవాళ్లను పాలిస్తుంది.

 కేవలం దేవుని పరిపాలనలో మాత్రమే మనుషులు జంతువులతో శాంతిగా ఉండడం నేర్చుకుంటారు అలాగే పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉంటారు.—యెషయా 11:6-9.

a యెహోవా అనేది దేవుని పేరు.—కీర్తన 83:18.

b ‘రక్తానికి. . . దూరంగా ఉండమని’ బైబిలు ఆజ్ఞాపిస్తుంది. (అపొ 15:28, 29) అంటే దానర్థం మనం రక్తాన్ని తాగకూడదు లేదా రక్తం ఉన్న మాంసాన్ని తినకూడదు. అలాగే రక్తాన్ని కలిపిన ఏ ఆహారాన్ని తినకూడదు.