కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JenkoAtaman/stock.adobe.com

అప్రమత్తంగా ఉండండి!

2023ను ఆశతో మొదలుపెట్టడానికి కారణాలు—బైబిలు ఏం చెప్తోంది?

2023ను ఆశతో మొదలుపెట్టడానికి కారణాలు—బైబిలు ఏం చెప్తోంది?

 2023 ప్రారంభమైంది; అందరం మనకూ-మనవాళ్లకు మంచి జరగాలని కోరుకుంటాం. అలా జరుగుతుందనే ఆశతో ఎందుకు ఎదురుచూడవచ్చు?

బైబిలు మనలో ఆశను నింపుతుంది

 ప్రస్తుతం మనం అనుభవిస్తున్న కష్టాలు కొంతకాలమే ఉంటాయి, త్వరలో అవన్నీ తీరిపోతాయి అనే తీపి కబురు బైబిల్లో ఉంది. అసలు బైబిల్లో అలాంటి విషయాలు ఎందుకున్నాయో తెలుసా? అవి “ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని [లేదా, ఆశతో జీవించాలని] . . . రాయబడ్డాయి.”రోమీయులు 15:4.

మంచి రోజులు వస్తాయనే ఆశ ఇప్పుడెలా సహాయం చేస్తుంది?

 భవిష్యత్తు గురించి బైబిలు చెప్తున్న విషయాలు, “మన ప్రాణాలకు లంగరులా” ఉంటాయి. (హెబ్రీయులు 6:19) ఒడ్డు నుండి కొట్టుకొని పోకుండా లంగరు ఓడను కాపాడుతుంది. అచ్చం అలానే బైబిల్లో ఉన్న విషయాలు కూడా, ఇప్పుడున్న కష్టాల్ని తట్టుకోవడానికి, నిరాశపడకుండా ఉండడానికి, కలకాలం ఉండిపోయే సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తాయి. ఉదాహరణకు:

మంచి రోజులు వస్తాయనే ఆశను వదలుకోకండి

 మంచి జరగాలని చాలామంది ఆశపడతారు, కానీ ఆ ఆశ ఎప్పటికైనా నిజమౌతుందా అనే సందేహం వాళ్లకు ఉంటుంది. బైబిలు మాటిస్తున్న విషయాలు కూడా అలాంటివేనా? కాదు, అవి నిజమౌతాయా లేదా అనే సందేహమే అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాల్ని చెప్పింది స్వయంగా యెహోవా దేవుడు, a ఆయన అబద్ధమాడని దేవుడు. (తీతు 1:2) యెహోవాకు మాత్రమే, ఆయన మాటిచ్చిన వాటన్నిటినీ నిజం చేసే శక్తి ఉంది. “తనకు చేయాలనిపించిన ప్రతీది” ఆయన చేయగలడు.—కీర్తన 135:5, 6.

 బైబిల్లో ఉన్న విషయాలు ఖచ్చితంగా నిజమౌతాయి, వాటిని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ‘లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధించడం’ ద్వారా వాటిపై మీరు నమ్మకాన్ని పెంచుకోవచ్చు. (అపొస్తలుల కార్యాలు 17:11) బైబిలు విషయాల్ని మీకు మీరే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే, మా బైబిలు స్టడీ కోర్సు ప్రయత్నించి చూడండి. 2023వ సంవత్సరాన్ని, మంచి రోజులు వస్తాయనే ఆశతో మొదలుపెట్టండి!

a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.