ఆగస్టు 26, 2022
ఆస్ట్రేలియా
సువార్త పుస్తకాల్లో యేసు కథ ఎపిసోడ్ 1 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
సువార్త పుస్తకాల్లో యేసు కథ ఎపిసోడ్ 1 మొదటి విడత షూటింగ్ ఆగస్టు 12, 2022న పూర్తయింది. కాస్త విరామం తర్వాత, రెండో విడత షూటింగ్ మొదలౌతుంది. అది దాదాపు అక్టోబరు, 2022 కల్లా పూర్తవ్వచ్చు.
ఇంతకుముందు చెప్పినట్టు, సువార్త పుస్తకాల్లో యేసు కథ షూటింగ్‌ని మే 20, 2022న సహోదరులు మొదలుపెట్టారు. ఆ షూటింగ్ ఎక్కువశాతం ఇన్‌డోర్ సెట్లలోనే జరిగింది. ఎందుకంటే, ఆ సమయానికల్లా సపోర్ట్ బిల్డింగ్‌కి సంబంధించి అలాగే యేసు కాలంనాటి ఔట్‌డోర్ సెట్లను వేయడానికి పేపర్ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ పేపర్ వర్క్ అంతా జూలై 15, 2022న పూర్తయింది. దాంతో, ఆస్ట్రలేసియా బ్రాంచి కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ ఆ బిల్డింగ్‌ని అలాగే షూటింగ్ స్థలాన్ని రీజనల్ వీడియో టీమ్‌కి (RVT) అప్పగించారు. అప్పటినుండి షూటింగ్ కోసం ఆ భవనాలు సిద్ధంగా ఉన్నాయి.
అచ్చం యేసు కాలంనాటి సెట్లను 75,347 చదరపు అడుగుల స్థలంలో వేశారు. వాటిని వేయడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి 500కన్నా ఎక్కువమంది బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారు. ఈ నిర్మాణం గురించి కన్‌స్ట్రక్షన్ కమిటీ కోఆర్డినేటర్ అయిన బ్రదర్ రస్సెల్ గ్రేగొవిచ్ ఏమంటున్నాడంటే: “ఈ ప్రాజెక్ట్‌లో మాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ యెహోవా సహాయాన్ని కళ్లారా చూశాం. యెహోవా పవిత్రశక్తితోనే వాటన్నిటిని దాటుకొని ఇక్కడి దాకా వచ్చామని ఖచ్చితంగా చెప్పగలం.”
టీచింగ్ కమిటీ సహాయకుడైన బ్రదర్ రోనాల్డ్ కర్జన్ మొదటి విడత షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలాసార్లు వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే: “కన్‌స్ట్రక్షన్ వాలంటీర్లు, బెతెల్ కుటుంబం కలిసిమెలిసి ఒక జట్టులా భలేగా పనిచేశారు. ఇన్ని సంవత్సరాలు ప్లానింగ్ చేసి, సెట్లను వేసిన తర్వాత చూడ్డానికి కన్నుల పండగ్గా ఉంది. ఈ బ్రాంచి టెరిటరీలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఇచ్చిన మద్దతును చూస్తే చాలా ముచ్చటేసింది. యేసు జీవితం గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి ఈ 18 ఎపిసోడ్‌ల వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని చెప్పడంలో ఏ సందేహం లేదు.”
ఎపిసోడ్ 1 మొదటి విడత షూటింగ్ చివర్లో, పరిపాలక సభ సభ్యుడైన బ్రదర్ కెన్నెత్ కుక్ వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే: “ఈ ప్రాజెక్ట్ అంతటిని మన ప్రేమగల యెహోవా నడిపిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. యెహోవాకు అలాగే సెట్లు వేయడానికి, షూటింగ్ చేయడానికి ఇష్టపూర్వకంగా, ప్రేమతో ముందుకొచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ అందరికి చాలాచాలా థ్యాంక్స్. యేసును అనుకరించడానికి, యెహోవాకు ఇంకా దగ్గరవ్వడానికి ఈ వీడియో సిరీస్ చాలామందికి సహాయం చేయాలన్నదే మా కోరిక.”
షూటింగ్ కోసం తయారుచేసిన సెట్‌లోకి వెళ్లడానికి దారి
పూర్తయిన సెట్లను పైనుండి తీసిన ఫోటో
వీడియోలో వాడే పశువుల కోసం వేసిన సెట్
యేసు కాలంనాటి సంత వీధి
యేసు కాలంనాటి ఒక ప్రభుత్వ భవనం