కంటెంట్‌కు వెళ్లు

జూన్‌ 18, 2020
ఇండియా

ఇండియాలోని ట్రాన్స్‌లేషన్‌ టీమ్‌లు కోవిడ్‌ సమయంలో అధిగమించిన ఆటంకాలు

ఇండియాలోని ట్రాన్స్‌లేషన్‌ టీమ్‌లు కోవిడ్‌ సమయంలో అధిగమించిన ఆటంకాలు

ఇండియాలోని 11 రిమోట్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసుల్లో (RTO) పనిచేస్తున్న సహోదర సహోదరీలు మన ప్రచురణల్ని 36 భాషల్లోకి అనువదిస్తారు. కానీ కోవిడ్‌ సమయంలో వాళ్లు కొత్త సమస్యలను ఎదుర్కొన్నారు. యెహోవా సహాయంతో ఆ సమస్యలను అధిగమించి పనిని కొనసాగిస్తున్నారు.

అనువాద పనిలో సహోదర సహోదరీలు టీమ్‌గా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కానీ కోవిడ్‌ కారణంగా ఇండియా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దానివల్ల అనువాదకులు నేరుగా కలసి పనిచేయడం కష్టమైంది. ఆడియో-వీడియో రికార్డింగ్‌లో పనిచేస్తున్న సహోదర సహోదరీలు కూడా నేరుగా కలసి పని చేయలేకపోయారు.

RTOల్లో అనువాదకులు నేరుగా కలసి పనిచేసే బదులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనువాద పనిచేశారు. రికార్డింగ్‌ల కోసం రిమోట్‌ రికార్డింగ్‌ అనే పద్ధతి ఉపయోగించారు. ఇలా కొత్త పద్ధతుల్లో పనిచేయడంవల్ల వేరే దేశాల్లో, అంటే బంగ్లాదేశ్‌, అమెరికాలో ఉన్న సహోదర సహోదరీల సహాయాన్ని కూడా అనువాదకులు తీసుకోగలిగారు.

సంజ్ఞ భాష RTOలో పనిచేస్తున్న సహోదరులు సామాజిక దూరాన్ని పాటిస్తూనే, వీడియోలను తయారు చేయడానికి కొత్త పద్ధతుల్ని కనిపెట్టారు. కొంతమంది అనువాదకులు తమ బెడ్‌రూమ్‌లను స్టూడియోలుగా మార్చుకున్నారు. వీడియోల్ని తయారు చేయడానికి సాధారణంగా ఆఫీసులో ఉపయోగించే పరికరాలు లేకపోయేసరికి ఇంట్లో ఉన్నవాటిని ఉపయోగించారు. ఉదాహరణకు పెద్దపెద్ద కెమెరాలకు బదులు సెల్‌ఫోన్‌లు ఉపయోగించి, వాటిని స్టాండ్‌ల మీద పెట్టే బదులు అట్టపెట్టెల మీద పెట్టి రికార్డ్‌ చేశారు.

వీటన్నిటితో పాటు RTOలో పనిచేసే అనువాదకులు ఈ సమయంలో సంతోషంగా ఉండడానికి, మంచి ఫలితాలు సాధించడానికి యెహోవా మీద ఆధారపడుతున్నారు. వాళ్లలో కొంతమంది అన్న ఈ మాటల్ని గమనించండి:

కోల్‌కతాలో పనిచేస్తున్న బ్రదర్‌ జోస్‌ ఫ్రాన్సిస్‌ ఇలా అన్నారు: “కష్టాలు వచ్చినప్పుడు మనుషులకు అడ్డుగా ఒక గోడ కనిపిస్తుంది. కానీ యెహోవాకైతే దాన్ని దాటివెళ్లే దారి కనిపిస్తుంది.”

బెంగుళూరులో పనిచేస్తున్న సహోదరి బిందు రాణి చందన్‌ ఏమన్నారంటే: “ఈ కష్టసమయాల్లో యెహోవా నన్ను ఉపయోగించుకుంటున్నాడు అనే విషయం, ఎన్ని సవాళ్లున్నా సంతోషంగా ఉండడానికి నాకు సహాయం చేస్తుంది.”

వడోదరలో పనిచేస్తున్న సహోదరి రుబీనా పటేల్‌ ఇలా అన్నారు: “యెహోవాను, ఆయన సంస్థను ఏది ఆపలేదు. చివరికి కరోనా కూడా.”

ఈ అనువాద పనిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న సహోదర సహోదరీలను చూసి మేం గర్వపడుతున్నాం. వాళ్లు ఆ పనిలో విజయం సాధించడానికి యెహోవా పవిత్రశక్తే కారణమని మేం నమ్ముతున్నాం. ఆ పవిత్రశక్తే యేసు చెప్పిన ప్రవచనంలోని ఈ మాటల్ని నెరవేరేలా సహాయం చేస్తుంది: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది.”—మత్తయి 24:14.