కంటెంట్‌కు వెళ్లు

జూన్‌ 28, 2021
ఇండియా

ఇండియాలో తమిళ్‌ కొత్త లోక అనువాదం రోమన్‌ లిపిలో విడుదలైంది

ఇండియాలో తమిళ్‌ కొత్త లోక అనువాదం రోమన్‌ లిపిలో విడుదలైంది

2021, జూన్‌ 27న తమిళ్‌ కొత్త లోక అనువాదం రోమన్‌ లిపిలో విడుదలైంది. 16 వేర్వేరు దేశాల్లో ఉంటున్న తమిళ్‌ భాష మాట్లాడే సహోదర సహోదరీలు ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చూశారు.

ఈ ప్రాజెక్ట్‌ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

  • ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 కోట్ల కన్నా ఎక్కువమంది తమిళ్‌ భాష మాట్లాడతారు

  • 334 తమిళ్‌ సంఘాల్లో, 32 చిన్న గుంపుల్లో మొత్తం 20,500 కన్నా ఎక్కువమంది ప్రచారకులు సేవచేస్తున్నారు

  • ఈ ప్రాజెక్ట్‌ని పూర్తిచేయడానికి ఐదుగురు అనువాదకులు 6 నెలలు పనిచేశారు

2016 సెప్టెంబరులో కొత్త లోక అనువాదం తమిళ్‌ లిపిలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా తమిళ్‌ భాష మాట్లాడే ప్రజలకు ఇదొక గొప్ప వరం. అయితే కొంతమందికి తమిళ్‌ లిపి చదవడం కష్టం, వాళ్లు తమిళ్‌ని రోమన్‌ లిపిలో చదవడానికి ఇష్టపడతారు.

ఒక అనువాదకురాలు ఇలా అంటుంది: “వ్యక్తిగత అధ్యయనం చేసేటప్పుడు బైబిల్ని తమిళ్‌ లిపిలో చదవడం నాకు కష్టమైంది. అందుకే ఇంగ్లీష్‌ బైబిల్ని ఎక్కువగా వాడేదాన్ని. అయితే ఇప్పుడు రోమన్‌ లిపిలో ఉన్న ఈ బైబిలు నాకెంతో సహాయం చేస్తుంది.”

ఈ బైబిలు అనువాదం చాలామంది సహోదర సహోదరీలకు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవడానికి, వాళ్ల జీవితంలో సంతోషాన్ని పొందడానికి అలాగే పరిచర్యలో మంచి ఫలితాలు సాధించడానికి సహాయం చేస్తుందని మేం నమ్ముతున్నాం.—యెహోషువ 1:8, అధస్సూచి.