కంటెంట్‌కు వెళ్లు

రమాపో మీడియా ప్రొడక్షన్‌ ఫెసిలిటీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో వివరించే ఊహాచిత్రం సర్కిల్‌లో: 2023 జూన్‌, 28న జరిగిన రమాపో టౌన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌ మీటింగ్‌

2023 జూలై, 3
ప్రపంచ వార్తలు

ప్రపంచ ప్రధాన కార్యాలయం-రమాపో ప్రాజెక్ట్‌

రమాపో నిర్మాణ ప్రాజెక్ట్‌కి ముఖ్యమైన ఆమోదం దొరికింది

రమాపో నిర్మాణ ప్రాజెక్ట్‌కి ముఖ్యమైన ఆమోదం దొరికింది

2023 జూన్‌, 28న అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న రమాపో నిర్మాణ ప్రాజెక్ట్‌కి ఒక ప్రాముఖ్యమైన ఆమోదం దొరికింది. రమాపో టౌన్‌ ప్లానింగ్‌ బోర్డ్‌లోని సభ్యులందరూ దాని సైట్‌ ప్లాన్‌కి ఆమోదాన్ని ఇచ్చారు. ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇంకొన్ని పనుల్ని మనం చేయాల్సి ఉన్నా, ఈ ఆమోదం రావడం వల్ల, దానిని నిరాటంకంగా ముందుకు నడిపించొచ్చు.

ఆసక్తికరంగా ప్లానింగ్‌ బోర్డ్‌ మీటింగ్‌లో, స్థానికుల నుండి అలాగే అధికారుల నుండి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. నిర్మాణ ప్రాజెక్ట్‌ కమిటీలో సభ్యుడైన బ్రదర్‌ కీత్‌ క్యాడి ఇలా చెప్పాడు: “బోర్డ్‌కి మా సైట్‌ ప్లాన్‌ని చూపించడానికి, దానికి సంబంధించిన పనుల్ని చేయడానికి నెలలకొద్దీ కష్టపడ్డాం. ఏ ఆటంకం లేకుండా వాళ్లు వెంటనే ప్లాన్‌ని ఆమోదించడమే మా లక్ష్యం.” మనం అన్ని నిబంధనల్ని పాటించామని బోర్డ్‌ సభ్యులు గుర్తించి, ప్రాజెక్ట్‌కి సంబంధించి మేం పెట్టిన ప్రతీ తీర్మానాన్ని ఆమోదించారు. “మొత్తం మీటింగ్‌ గంటలోపే అయిపోయింది!” అని నిర్మాణ ప్రాజెక్ట్‌ కమిటీలో ఉన్న మరో సభ్యుడైన బ్రదర్‌ డేవిడ్‌ సోటో అన్నాడు. “ప్లానింగ్‌ బోర్డ్‌ చేసిన కృషికి, వెంటనే వాళ్లిచ్చిన మద్దతుకి, సహకారానికి మా కృతజ్ఞతలు. టౌన్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌తో భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాం.”

రమాపో ప్రాజెక్ట్‌కి వచ్చిన ఈ తాజా ఆమోదం వల్ల ముఖ్యమైన పనుల్ని వెంటనే ప్రారంభించొచ్చు. “ఒక్కసారి సైట్‌ నుండి చెట్లని తొలగించాక, కాంట్రాక్టర్లు వాళ్ల పనిని మొదలుపెట్టుకోవచ్చు. అప్పుడు, వచ్చే సంవత్సరం చివర్లో చాలామంది స్వచ్ఛంద సేవకులు సైట్‌కి వచ్చి పనిచేయడానికి కుదురుతుంది. వీలైనంత త్వరగా మీ పనిని మొదలుపెట్టుకోండి అని బోర్డ్‌ సభ్యులు అనడం మాకు పట్టలేని ఆనందాన్ని ఇచ్చింది.”

ఈ ఆమోదం వచ్చేలా సహాయం చేసిన యెహోవాకు మనం కృతజ్ఞతలు చెప్దాం. ‘మంచిపని కోసం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి’ అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న వాళ్లందరినీ యెహోవా దీవించాలని మనం ప్రార్థిద్దాం.—నెహెమ్యా 2:18.