కంటెంట్‌కు వెళ్లు

యుక్రెయిన్‌లోని టియాచివ్‌లో, శరణార్థుల కోసం సమావేశ హాల్లో చేసిన నివాస ఏర్పాట్లు

మార్చి 8, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #1 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

అప్‌డేట్‌ #1 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుక్రెయిన్‌లో ఎడతెరిపి లేకుండా జరుగుతున్న బాంబు పేలుళ్ల వల్ల మారియుపోల్‌, ఖార్కివ్‌, హాస్టొమెల్‌ లాంటి పట్టణాల్లో మన సహోదర సహోదరీల పరిస్థితి రోజురోజుకీ కష్టంగా తయారౌతుంది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మన సహోదర సహోదరీలు, ఒక వారం నుండి ఎటూ కదల్లేకపోతున్నారు. వాళ్లు దాచుకున్న ఆహారం అయిపోవస్తుంది. కరెంట్‌ లేకపోవడం వల్ల, ఇంటర్నెట్‌-ఫోన్‌లు పనిచేయకపోవడం వల్ల మన సహోదర సహోదరీల బాగోగులు తెలుసుకోవడం కష్టమైపోతుంది.

మిర్నోరాద్‌లో ఉంటున్న 28 ఏళ్ల సంఘపెద్ద, దిమిత్రో రోజ్దోర్‌స్కీ ఒక మందుపాతర మీద అడుగుపెట్టాడు. అది పేలిపోవడంవల్ల తగిలిన గాయాలతో ఆయన చనిపోయాడు. యుక్రెయిన్‌లో విపరీతంగా జరుగుతున్న బాంబు పేలుళ్ల వల్ల తమ కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కోల్పోయిన మన సహోదర సహోదరీల కోసం మేము ప్రార్థిస్తున్నాం.—2 థెస్సలొనీకయులు 3:1.

బాంబు పేలుళ్ల వల్ల యుక్రెయిన్‌లోని ఓవృచ్‌ నగరంలో ఉన్న ఒక రాజ్యమందిరం బాగా దెబ్బతింది

2022, మార్చి 7 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు అందిన సమాచారం:

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • ఇద్దరు ప్రచారకులు చనిపోయారు

  • 8 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 20,617 మంది ప్రచారకులు యుక్రెయిన్‌లోనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 25 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 29 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 173 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 5 రాజ్యమందిరాలు పాడయ్యాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 విపత్తు సహాయక కమిటీలు (DRCలు) పనిచేస్తున్నాయి

  • DRC వల్ల 6,548 ప్రచారకులకు సురక్షితమైన స్థలంలో ఉండడానికి చోటు దొరికింది

  • 7,008 ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు

  • పశ్చిమ యుక్రెయిన్‌లోని ట్రాన్స్‌కార్పాథియన్‌ ప్రాంతాల్లో, అలాగే షెర్నెవ్సీ, ఇవానో-ఫ్రాంకీవ్‌స్క్‌, లివీవ్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్న 30 రాజ్యమందిరాల్లో, ఒక సమావేశ హాల్లో శరణార్థుల్ని చేర్చుకోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి