అక్టోబరు 17, 2022 | అప్‌డేట్: మార్చి7, 2024
రష్యా
అప్‌డేట్—తీర్పు | విచారణలో ఉన్న మాగడాన్ ప్రాంతంలోని 13 మంది సాక్షులు
మార్చి6, 2024, మాగడాన్ ప్రాంతంలో ఉన్న మాగడాన్ సిటీ కోర్టు ఈ సహోదరసహోదరీలను దోషులుగా తీర్పు తీర్చారు: సెర్గె అగాడ్జనోవ్, లుబోవ్ అసత్రియాన్, గలీనా డెర్గషీవా, ఇన్నా కార్డకోవా, ఇరీనా కొవోస్టోవా, గలీనా పెకో, కాన్‌స్టంటీన్ పెట్రోవ్, ఐవన్ పైడ, విక్టర్ రెవియేకిన్, మికాయెల్ సొలాన్‌సివ్, ఒక్‌సోనా సోన్‌సివా, సెర్గె యెర్కిన్, ఇవ్‌గినీ జైబ్‌లవ్.
సెర్గె అగాడ్జనోవ్, లుబోవ్ అసత్రియాన్, గలీనా డెర్గషీవా, ఇన్నా, ఇరీనా, గలీనా పెకో, విక్టర్, మికాయెల్, ఒక్‌సోనా వీళ్లకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష నిలిపివేయబడింది. ఇవ్‌గినీకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష నిలిపివేయబడింది. కాన్‌స్టంటీన్, ఐవన్, సెర్గె యెర్కిన్ వీళ్లకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష నిలిపివేయబడింది.అలా ప్రస్తుతానికి మన బ్రదర్-సిస్టర్స్ ఎవ్వరూ జైలుకు వెళ్లవల్సిన అవసరం లేదు.
టైమ్‌లైన్
మే 30, 2018
విపరీతవాదాన్ని ప్రోత్సహించే సంస్థ తరఫున పనిచేస్తూ, వాటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ఐవన్, కాన్‌స్టంటీన్, సెర్గె యెర్కిన్, ఇవ్‌గినీ మీద క్రిమినల్ కేసు పెట్టారు.
జూన్ 1, 2018
కేసు విచారణ జరిగే వరకు ఈ నలుగురు సహోదరుల్ని కస్టడీలోకి తీసుకున్నారు
ఆగస్టు 3, 2018
కాన్‌స్టంటీన్‌ను కస్టడీ నుండి విడుదల చేసి, హౌజ్ అరెస్ట్ చేశారు
అక్టోబరు 5, 2018
ఐవన్, సెర్గె యెర్కిన్, ఇవ్‌గినీలను విడుదల చేసి, హౌజ్ అరెస్ట్ చేశారు
మార్చి 20, 2019
సెర్గె అగాడ్జనోవ్, గలీనా డెర్గషీవా, ఇన్నా, ఇరీనా, లుబోవ్, మికాయెల్, ఒక్‌సోనా, విక్టర్‌ల మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీళ్లు ఎవ్వరూ ఊరు దాటి వెళ్లకూడదని ఆదేశించారు
మార్చి 27, 2019
ఐవన్, కాన్‌స్టంటీన్, సెర్గె యెర్కిన్, ఇవ్‌గినీలను హౌజ్ అరెస్ట్ నుండి విడుదల చేసి, ఊరు దాటి వెళ్లకూడదని ఆదేశించారు
ఏప్రిల్ 1, 2019
కేసు నమోదు చేసిన సహోదర సహోదరీలందరి మీద ఒకేసారి విచారణ జరిపించాలని అధికారులు నిర్ణయించారు
మార్చి 2, 2021
గలీనా పెకో ఊరు దాటి వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు
మార్చి 5, 2021
విపరీతవాదాన్ని ప్రోత్సహించే సంస్థ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గలీనా పెకో మీద కేసు నమోదు చేశారు. మిగతా 12 మంది సహోదరసహోదరీల కేసులో ఈమె కేసును కూడా కలిపారు
ఏప్రిల్ 25, 2022
క్రిమినల్ కేసు విచారణ మొదలైంది
ప్రొఫైల్స్
మన సహోదరసహోదరీలు ’క్రీస్తు పేరు కోసం నిందలు ఎదుర్కొంటున్నారు.’ కానీ వాళ్లకు “దేవుని మహిమగల పవిత్రశక్తి” తోడుగా ఉంది కాబట్టే వాళ్ల ముఖాల్లో చిరునవ్వు చెరగట్లేదు. వాళ్లను చూస్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా!—1 పేతురు 4:14.
a సహోదరుడు సెర్గె అగాడ్జనోవ్ మాటలు అందుబాటులో లేవు.